విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబ సభ్యుల బడితె పూజ
అసభ్యంగా ప్రవర్తించిన ఓ కీచక ఉపాధ్యాయుడికి విద్యార్థిని తల్లిదండ్రులు బడితె పూజ చేసిన ఘటన ఇది.
హైదరాబాద్: అసభ్యంగా ప్రవర్తించిన ఓ కీచక ఉపాధ్యాయుడికి విద్యార్థిని తల్లిదండ్రులు బడితె పూజ చేసిన ఘటన ఇది. ఉప్పల్ లోని భరత్ నగర్ లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... సదరు ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల అదే పాఠశాలలో ఉపాధ్యయుడిగా పనిచేస్తున్న నవీన్ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. మొదట్లో ఆ బాలిక పట్టించుకోకపోయినా ఈ మధ్య అతడి వేధింపులు అధికం అయ్యాయి.

దీంతో ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆ పాఠశాలకు చేరకుని సదరు ఉపాధ్యయుడికి దేహశుద్ధి చేశారు.
అంతేకాకుండా చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలా చేయవచ్చా అంటూ ఆ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. కీచకుడైన ఉపాధ్యాయుడిని నియమించుకున్న ఆ ప్రైవేటు పాఠశాల అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications