మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడారిలా!

గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి కాలేజీలు ఏదో విధంగా వార్తల్లో ఉంటున్నాయి. పలు సమస్యల కారణంగా విద్యార్థుల ఆందోళనలతో మల్లారెడ్డి కాలేజీలు ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, మరో ఘటనతో మల్లారెడ్డి కాలేజీ పేరు మీడియాలో వినిపించింది. మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడమే ఇందుకు కారణం.

మేడ్చల్ - పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న కీర్తి అనే విద్యార్థిని.. క్యాంపస్ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో కాలేజీ 4వ అంతస్తు కిటికీ నుంచి దూకబోయింది.

Student attempts suicide at Mallareddy Women s Engineering College

అయితే, గమనించిన తోటి విద్యార్థులు ఆమెను కిందపడకుండా గట్టిగా పట్టకున్నారు. ఆ తర్వాత ఆమెను లోపలికి లాగడంతో ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థినికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య

ప్రియుడి వేధింపులు భరించలేక ఓ ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ ఎస్వీ నగర్‌కు చెందిన గుండె సత్యనారాయణ కూతురు పూజిత (21) ఘట్‌కేసర్‌లోని వీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది.

నాచారం రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ఇంద్ర చరణ్ రెడ్డి (22) వీబీఐటీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కాగా, వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, నెల రోజుల క్రితం మనస్పర్థలు రావడంతో వీరిద్దరు దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో గతంలో ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు చూపిస్తూ ఇంద్రచరణ్ రెడ్డి.. బ్లాక్ మెయిల్ చేయడం, వేధించడంతో పూజిత మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో
ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది పూజిత. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు ఇంద్రచరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+