కళాశాల హాస్టల్‌లో ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఖమ్మం: నగరంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థి తను ఉంటున్న కళాశాల హాస్టల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సూర్యతండాకు చెందిన జె సుమన్ (17) కృష్ణవేణి జూనియర్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా.. వారు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కాలేజీకి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

షార్ట్ సర్క్యూట్: చెరకు పంట దగ్ధం
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆత్మకూరు మండల శివార్లలోని ఏడెకరాల చెరకు పంట షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైపోయింది. బంగారు భాస్కర్ అనే వ్యక్తికి చెందిన ఏడెకరాల పొలాన్ని కిష్టన్న అనే రైతు కౌలుకు తీసుకుని చెరకు పంట వేశాడు. రెండు రోజుల్లో పంటను కోసేందుకు సిద్ధమైయ్యాడు.
అయితే, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడెకరాల్లోని చెరకు పంట పూర్తిగా దగ్ధమైంది. పొలంలోంచి 11కేవీ విద్యుత్ లైన్ వైర్లు వెళ్లాయి. వాటి వల్ల షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. చేతికొచ్చిన పంట అగ్నికి అహూతవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications