ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం అరెస్ట్: హెచ్ఆర్సీకి బంధువుల ఫిర్యాదు

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రవళిక (Pravalika Suicide) ఆత్మహత్య కేసులో.. నిందితుడు శివరాంను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 13న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక.. హైదరాబాద్​ చిక్కడపల్లిలోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. శివరాం వేధింపుల వల్లే.. ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.

శివరాంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శివరాం పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. శివరాం అరెస్టును పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టాక.. కస్టడీ రిమాండ్ కోరే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. శివరాంను ప్రశ్నిస్తే.. మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.

Student Pravalika Suicide Accused Shivaram Arrested

కాగా, ప్రవళిక చనిపోయినప్పటి నుంచి శివరాం కనిపించడం లేదు. ప్రవళిక మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగడం, గ్రూప్ పరీక్షల వాయిదాల వల్లే మానసిక ఒత్తిడితో చనిపోయిందని సహచరులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగడంతో.. ఈ విషయం రాజకీయరంగు పులుముకుంది.

విద్యార్థులతోపాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు అర్థరాత్రి ఆందోళనకు దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు మృతురాలి స్నేహితులను ప్రశ్నించారు. శివరాంతో పరిచయం గురించి వారు చెప్పగా ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రవళిక చనిపోయినప్పటి నుంచి శివరాం కనిపించకపోవడం కూడా వారి అనుమానాలకు మరింత బలం పెంచింది. ఆమె సెల్​ఫోన్ డేటా, వాట్సప్ చాట్ రికవరీ చేసి శివరాం వేధింపుల వల్లే చనిపోయిందని నిర్థరణకు వచ్చారు.

మరోవైపు, ఇదే విషయాన్ని ప్రవళిక కుటుంబసభ్యులు కూడా రెండు రోజుల క్రితం మీడియాకు వివరించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని సూచించారు. శివరాం వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కాగా, కేటీఆర్​ కూడా మృతురాలి కుటుంబసభ్యులతో సమావేశయ్యారు. ప్రవళిక అత్మహత్యకు కారణమైన శివరాం పట్ల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రణయ్(ప్రవళిక సోదరుడు)కు ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఇది ఇలావుండగా, తమకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని శివరాం కుటుంబ సభ్యులు.. రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌​ను ఆశ్రయించారు. శివరాం అచూకీ చెప్పాలంటూ.. పోలీసులు తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను, తమ బంధువులను పోలీస్ స్టేషన్‌​కు పిలిపించి.. శివరాం ఆచూకీ తెలుపకపోతే ఎన్‌​కౌంటర్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+