తవ్విన కొద్దీ: 'సుబ్బరాజును ప్రశ్నిస్తుంటే కీలక విషయాలు బయటకు, కొత్త కోణాలు'
డ్రగ్స్ కేసులో నటుడు సుబ్బరాజు విచారణకు సహకరించారని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. ఈ రోజు (శుక్రవారం) కీలక అంశాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నామన్నారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నటుడు సుబ్బరాజు విచారణకు సహకరించారని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. ఈ రోజు (శుక్రవారం) కీలక అంశాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నామన్నారు. సుబ్బరాజు విచారణ సాయంత్రం ముగిసింది.

ఈ రోజు కీలక సమాచారం..
ఈ రోజు ముఖ్యమైన సమాచారం వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సుబ్బరాజును ప్రశ్నిస్తుంటే కీలక విషయాలు బయటపడుతున్నాయన్నారు.

కొత్త కోణాలు
ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా వివరాలు సేకరిస్తున్నామని చంద్రవదన్ చెప్పారు. డ్రగ్ కేసులో సిట్ కొత్త కోణాలను అన్వేషిస్తోందని చెప్పారు. ఈ కేసులో లోతుగా దర్యాఫ్తు జరగాల్సిన అవసరముందని చెప్పారు.

స్టేట్‌మెంట్ రికార్డ్.. ఆధారాలు చూపించారు
సుబ్బరాజు స్టేట్‌మెంటును అధికారులు రికార్డ్ చేశారు. అలాగే, సుబ్బరాజు సరిగా సమాధానం చెప్పని సందర్భాల్లో ఆధారాలు చూపించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు.

ఈ ప్రశ్నలేనంటూ..
సినీ నటుడు సుబ్బరాజు సాయంత్రం దాకా కొనసాగింది. ఆయనను సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు సుదీర్ఘంగా విచారించింది. ఆయనను పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఉదయం పదింపావు నుంచి ఆయన విచారణ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. సుబ్బరాజుకు అధికారులు ఈ ప్రశ్నలే వేస్తున్నారంటూ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మీకు డ్రగ్స్ అలవాటు ఉందా? పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉంటారా? పూరీ ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా? పూరీతో కలసి బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఏ ఫోన్ నెంబర్లు వాడారు? అక్కడ ఏం చేశారు? అక్కడ పూరీ విదేశీ నంబర్లు వాడారు, మీకు తెలుసా?
కెల్విన్ తెలుసా? ఎలా పరిచయం అయ్యాడు? పూరీ, శ్యామ్ లతో పాటు మీరూ కెల్విన్ ను కలిసేవారా? పూరీ ఇంట్లో పార్టీలో ఏం జరిగేది? మీరు డ్రగ్స్ పార్టీలకు వెళ్లేవారా? కెల్విన్ తో మీరు డైరెక్ట్ గా డీల్ చేసేవారా? కెల్విన్ కు మీరు ఎవరెవరిని పరిచయం చేశారు?
మీకు ఎంత మంది ఈవెంట్ ఆర్గనైజర్లు తెలుసు? సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు ఉంది? మీ రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలను పరీక్షలకు తీసుకోవచ్చా?
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications