సుధాకర్ రెడ్డి హత్య: నోరు విప్పిన రాజేష్, ఏం చెప్పాడు..
నాగర్ కర్నూలు: ప్రియురాలు స్వాతితో కలిసి ఆమె భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన సంఘటనపై నిందితుడు రాజేష్ నోరు విప్పాడు. సుధాకర్ రెడ్డి హత్యకు ఎలా పథక రచన చేసి అమలు చేసిందీ వివరించాడు.
ముఖం కాలిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

సుధాకర్ అంటే స్వాతికి ఇష్టం లేదు...
సుధాకర్ రెడ్డి అంటే స్వాతికి ఇష్టం లేదని రాజేష్ చెప్పాడు. సుధాకర్ రెడ్డితో ఆమెకు సంబంధాలు సరిగా లేవని, దాంతో తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిందని అన్నారు. సుధాకర్ రెడ్డిని చంపాలని అనుకోలేదని, అది అలా జరిగిపోయిందని అన్నాడు.

పారిపోదామని చెప్పా...
ఇద్దరం ఎక్కడికైనా పారిపోదామని స్వాతితో తాను చెప్పానని రాజేష్ అన్నాడు. అయితే, పిల్లలూ తల్లిదండ్రులనూ వదిలేసి రాలేనని చెప్పిందని, దాంతో సుధాకర్ రెడ్డిని హత్య చేసి అతని స్థానంలో తాను రావడానికి పథక రచన చేశామని అతను చెప్పాడు. సుధాకర్ రెడ్డిని చంపేద్దామనే ఆలోచన చేసింది స్వాతి అని చెప్పాడు.

ముందు రోజు వారిద్దరి మధ్య గొడవ
హత్యకు ముందు రోజు స్వాతికి, సుధాకర్ రెడ్డికి మధ్య గొడవ జరిగిందని, ఆ మర్నాడు సుధాకర్ రెడ్డిని హత్య చేసి ఇనుపరాడ్‌తో ఇంట్లోనే కొట్టి చంపినట్లు తెలిపాడు. ఇనుపరాడ్‌తో తలపై బలంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని తగులబెట్టి ఇంటికి వచ్చేటప్పుడు రాజేష్, స్వాతి పెట్రోల్ తెచ్చుకున్నారు.

స్వాతి చున్నీపై పెట్రోల్ పోసి
స్వాతి చున్నీపై పెట్రోల్ పోసి, కాల్చి రాజేష్ ముఖంపై వేసుకున్నాడు. అయితే, సరిగా కాలకపోవడంతో అతను ముఖాన్ని మండుతున్న స్టౌవ్‌పై పెట్టాడు. ఆ తర్వాత రాజేష్‌ను సుధాకర్ రెడ్డిగా చూపించేందుకు స్వాతి ప్రయత్నించిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి హత్యకు రెండు రోజుల ముందే ప్లాన్ వేసుకున్నట్లు రాజేష్ వెల్లడించాడు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications