నకిలీ పోలీస్ అరెస్ట్: డమ్మీ తుపాకీతో అమీర్‌పేటలోని ప్రేమ జంటలే టార్గెట్

హైదరాబాద్: నగరంలో నకిలీ పోలీస్ హల్‌ చల్ సృష్టించాడు. డమ్మీ రివాల్వర్‌తో అమీర్ పేట, ఎస్ఆర్ నగర్‌లోని హాస్టళ్లు, ప్రేమ జంటలే టార్గెట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. రెండు రోజుల పాటు నిఘా ఉంచిన ఎస్ఆర్ నగర పోలీసులు సోమవారం అతడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండకు చెందిన అప్పలాయుడు చిన్నప్పటి నుంచి జల్సాకు అలవాడు పడ్డాడు. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు వచ్చాడు. నగరంలో స్పెషల్ పార్టీ పోలీసునంటూ బెదిరింపులకు దిగుతున్నాడు.

Sudo Police Hulchul In Hyderabad

అమీర్ పేట, ఎస్‌ఆర్ నగర్‌లోని హాస్టళ్లు, ప్రేమ జంటలను టార్గెట్ చేసుకుని గత కొంతకాలంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో అమీర్ పేటలోని హాస్టల్ యజమాని ఈ నకిలీ పోలీసు గురించి ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ సూడో పోలీసుపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అతడిపై నిఘా ఉంచారు.

రెండు రోజుల పాటు నిఘా ఉంచిన పోలీసులు సోమవారం నిందితుడి అప్పలనాయుడిని అరెస్ట్ చేశారు. సోమవారం అప్పలనాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కూడా తాను స్పెషల్ పార్టీకి చెందిన పోలీసునని, తానొక కేసు నిమిత్తం ప్రేమ జంటలను విచారిస్తున్నానంటూ పోలీసులను కూడా బురిడీ కొట్టించాడు.

Sudo Police Hulchul In Hyderabad

అయితే చివరకు అతడి పోలీసు ఐడెంటిటీ గుర్తింపు కార్డుని చూపించమని ప్రశ్నించగా అప్పలనాయుడు నీళ్లు నమిలాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో గతంలో కొంత మంది ప్రేమ జంటల ఎదపై పెట్టి బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలుస్తోంది.

ఈ క్రమంలో అప్పలనాయుడు హైదరాబాద్ నగరానికి ఎప్పుడొచ్చాడు, ఇప్పటి వరకు అతను చేసిన పాత నేరాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+