Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్! మరిచిపోయావ్.. ఇలా చేయి, నా మద్దతు కేసీఆర్‌కే: నటుడు సుమన్

హైదరాబాద్/విశాఖపట్నం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పూర్తి మద్దతు తెలంగాణ రాష్ట్ర సమితికే ఉంటుందని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. ఏపీలోని విశాఖపట్నంలో కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ సాధించడానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని సుమన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన మద్దతు కేసీఆర్‌కు ఉంటుందని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆరే రావాలని ఆకాంక్షించారు.

Suman praises KCR and suggestion to Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేక హోదా విషయమై విమర్శలు గుప్పించి, అదే సమయంలో సూచన చేశారు నటుడు సుమన్. జనసేనాని ప్రత్యేక హోదా గురించి మరిచిపోయారని చెప్పారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ హోదా కోసం గట్టిగా పోరాడాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆయన ఆందోళన చేపట్టాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+