దేవుడు సామీ: మహేశ్ బాబు సాయంతో మరో రెండు గుండెలకు ప్రాణం, వెయ్యి మందికిపైగా చికిత్స
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. గ్రామాలను దత్తత తీసుకోవడంతోపాటు చిన్న ప్రాణాలు నిలబెట్టే బృహత్తర సేవా కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. తాజాగా, మరో ఇద్దరు చిన్నారుల ప్రాణాలను నిలబెట్టారు ఈ మనసున్న సూపర్ స్టార్.

వారి చిరునవ్వుకు మహేశ్ కారణం..
మహేశ్ అందించిన సాయంతో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. కాగా, మహేశ్ ఇప్పటికే సుమారు 1000 మంది చిన్నారులకు శస్త్ర చికిత్సకు సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు. మరో ఇద్దరు తల్లిదండ్రుల చిరునవ్వుకు సూపర్ స్టార్ కారణమయ్యారని మహేశ్ సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
మరో రెండు గుండె చప్పుళ్లు..
మా ఫ్యామిలీలో మరో రెండు గుండె చప్పుళ్లు చేరాయి. ఇటీవల శస్త్ర చేసిన ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇలాంటి కష్ట సమయంలోనూ సహకరించిన ఆంద్రా ఆస్పత్రికి ధన్యవాదాలు అని నమ్రత పేర్కొన్నారు.

నువ్వు దేవుడు సామీ అంటూ..
అంతేగాక, ఆ చిన్నారులకు తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు నమ్రత. ఆ పిల్లలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. కాగా, యూకేకు చెందిన ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్' అనే సంస్థతో కలిసి మహేశ్ ఈ గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో నమ్రత పోస్టును చూసిన అభిమానులు, నెటిజన్లు మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచి మనసున్న సూపర్ స్టార్ అంటూ కొనియాడుతున్నారు. నువ్వు దేవుడు సామీ అంటూ పొగుడుతున్నారు.
-
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో












Click it and Unblock the Notifications