కొండా సురేఖ వ్యాఖ్యలపై మహేష్ బాబు ఏమన్నారంటే!

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారంనాడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆమె నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అని, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటుచేసి వారి జీవితాలను నాశనం చేశారని, కొంతమంది హీరోయిన్లు పరిశ్రమను వదిలిపెట్టి పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడానికి కూడా కారణం కేటీఆర్ అంటూ ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే ఆమె సమంత, నాగచైతన్య, నాగార్జున, కేటీఆర్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలను సినీ పరిశ్రమ సంయుక్తంగా ఖండిస్తోంది.

బాధకు గురిచేశాయి
దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్రంగా స్పందించారు. మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధకు గురిచేశాయన్నారు. ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు ఒక భార్యకు భర్తగా, ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక తల్లికి కుమారుడిగా తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. ఇటువంటి ఆధారం లేని, చౌకబారు ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మహేష్ బాబు అన్నారు. ఎప్పుడూ సినీ పరిశ్రమను లక్ష్యంగా ఎంచుకొని కామెంట్స్ చేయవద్దని, మనదేశంలో ఉన్న మహిళలతోపాటు ఇతర సినీ ప్రముఖులను కూడా ఎంతో గౌరవ మర్యాదలతో చూడాలని తాను కోరుకుంటున్నానన్నారు.

super star mahesh babu responded minister konda surekha comments

నీచమైన ఆరోపణలు చేశారు
ఓ మహిళా మంత్రి నీచమైన ఆరోపణలు చేయడం తనను ఎంతో భయాందోళనలకు గురిచేసిందని హీరో రవితేజ అన్నారు. రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైనవారిపై ఇటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు మంచివి కావన్నారు. రాజకీయ యుద్ధంలో అమాయక వ్యక్తులను, మహిళలను లాగొద్దని కోరారు. రాజకీయ నాయకులంతా సామాజిక విలువలు పెంచుతూ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. రవితేజతోపాటు హరీష్ శంకర్, సందీప్ కిషన్, మంచు మనోజ్, సంయుక్త మీనన్, తేజ సజ్జా, రాజశేఖర్, సుమ కనకాల, బన్నీ వాసు, శైలేష్ కొలను, రాహుల్ విజయ్, కిరణ్ అబ్బవరం తదితరులు ఖండించారు. ఆధారాల్లేకుండా ఇటువంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని సినీ పరిశ్రమ ముక్త కంఠంతో హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+