ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీం ఏం చెప్పింది..!!

ఎమ్మెల్యే అనర్హత కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అంటూ సుప్రీం ప్రశ్నించింది. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పష్టం చేసారు. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్‌ న్యాయవాది జస్టిస్ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పందించిన జస్టిస్ గవాయ్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.

బీఆర్ఎస్ కు కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని, ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశముంటుందని ముకుల్ రోహిత్గీ కోర్టు లో వాదించారు. స్పీకర్‌ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని రోహత్గీ తెలిపారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని వాదనలు వినిపించారు. రోహిత్గీ వాదనల పైన జస్టిస్ గవాయ్ స్పందించారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా అని ప్రశ్నించారు.

supreme-court-made-key-comments-in-mlas-disqualification-case

ఈ మేరకు స్పీకర్ కు విజ్ఞప్తి చేయడం లేదా ఆదేశించడమో చేయలేమా అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రోహత్గీ స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారం లోనే న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్‌ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని కనీసం పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని తెలిపారు. ముకుల్‌ రోహత్గీ వాదనలపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ జోక్యం చేసుకున్నారు. న్యాయస్థానాలు రాజ్యాంగ పరి రక్షకులుగా వ్యవహరిస్తాయని చెప్పారు. నాలుగేళ్ల పాటు స్పీకర్‌ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాం టి చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాలా అంటూ ప్రశ్నించారు. ఫిరాయింపుపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్‌ వ్యవహరించలేరని రోహిత్గీ చెప్పారు. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి స్పీకర్‌ తన విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన అని కోర్టుకు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+