ముందస్తు ఎన్నికలపై స్టే విధించే అధికారం హైకోర్టుకు: కేసీఆర్‌కు సుప్రీం కోర్టు ఝలక్!
Recommended Video

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల పిటిషన్ పైన సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరిగింది. అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పైన స్టే విధించవలసి వస్తే హైకోర్టుకు ఆ అధికారం ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ లోపే విచారణ పూర్తి కావాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు కనిపిస్తే హైకోర్టు స్టే విధిస్తుందనే ఆశతో విపక్షాలు ఉన్నాయి. అదే జరిగితే తెరాసకు షాక్ అని చెప్పవచ్చు.

తెలంగాణలో 68 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్ వేశారని లాయర్ జంధ్యాల రవిశంకర్ తెలిపారు. శశిధర్ రెడ్డి రిట్ పిటిషన్ పైన హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించిందని జంధ్యాల తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఓటర్ల జాబితా విడుదలను అవసరమైతే వాయిదా వేసుకోవాలని సుప్రీం కోర్టు సూచన చేసిందని జంధ్యాల తెలిపారు.
మరోవైపు,తెలంగాణలో జరిగే ఎన్నికల్లో 2018, జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారే ఓటుహక్కు వినియోగించుకోవాలని ఈసీ చేసిన ప్రకటనపై శశాంక్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 20 లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోయే అవకాశం ఉందన్నారు. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఇదే అంశంపై నాలుగు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున వీటినీ వాటితో పాటు విచారించాలని హైకోర్టుకు సూచించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications