ఎంత సింపులో, రియల్ హీరో: కెటిఆర్‌పై ఊహించని ప్రశంస (ఫోటో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఊహించని ప్రశంస లభించింది. కెటిఆర్ సింప్లిసిటీని చూసి నరేంద్ర యాదవ్ అనే ప్రముఖ సర్జన్ ఫిదా అయిపోయారు. ట్విట్టర్‌లో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇటీవల డిజిటల్ లిటరసీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కెటిఆర్ ఢిల్లీకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విమానంలో ఆయన పక్కసీట్లో డాక్టర్ నరేంద్రయాదవ్ కూర్చున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో యాదవ్ సెల్ఫీ దిగారు. అనంతరం దానిని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన నరేంద్రయాదవ్.. ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Got selfie tips from none other than IT Czar of Telangana @KTRTRS Sir himself. #respect pic.twitter.com/yTraxUUqyz
— Narendra Yadav (@drnvikramaditya) September 12, 2015 "మంత్రి హోదాలో ఉన్న యువ నాయకుడు కేటీఆర్ ఎంత సింపుల్‌గా ఉన్నారో!. మందీ మార్బలం వంటి హంగులేవీ ఆయన చూట్టూ లేవు. ఆయన్ను చూస్తే గౌరవంగా ఉంది. నిజమైన హీరో. ఆయనతో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది" అని ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ; నాపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు అంటూ రీట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications