Congress: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. హస్తం వైపు మొగ్గు చూపుతున్న సర్వేలు..!
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి. సీఎం కేసీఆర్ ఈ నెల 15 నుంచి వరుస సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రచారంపై దృష్టి సారించాయి. అయితే ఈ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే తెలంగాణలో కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేశాయి. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటాపోటీ ఉండే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కు కాస్త మొగ్గు ఉన్నట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. ఏబీపీ-సీఓటర్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ కు 43 నుంచి 55 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు 48 నుంచి 60 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఏబీపీ-సీఓటర్ సర్వే అంచనా వేసింది. బీజేపీ 5 నుంచి 11, ఇతరులు 5 నుంచి 11 చోట్ల గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

పోల్ ట్రాకర్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ 35 నుంచి 40 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ 63 నుంచి 69 సీట్లు సాధించే అవకాశం ఉందని పోల్ ట్రాకర్ సర్వే అంచనా వేసింది. బీజేపీ 3 నుంచి 5, ఎంఐఎం 2 నుంచి 5, ఇతరులు 2 నుంచి 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ పల్స్ సర్వే చూసినట్లైతే బీఆర్ఎస్ 46 నుంచి 54 సీట్ల గెలుచుకునే అవకాశం ఉంది.
కాంగ్రెస్ 62 నుంచి 69 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. బీజేపీ 3 నుంచి 6 చోట్ల, ఎంఐఎం 5 నుంచి ఏడు స్థానాల్లో గెలుస్తారని తెలంగాణ పల్స్ సర్వే పేర్కొంది. లోక్ పోల్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ 45 నుంచి 51 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ 61 నుంచి 67 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 2 నుంచి 3, ఎంఐఎం 6 నుంచి 7, ఇతరులు ఒక చోట విజయం సాధిస్తారని పేర్కొంది.
జన్ మత్ సర్వే చూస్తే బీఆర్ఎస్ 45 నుంచి 47 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ 58 నుంచి 60 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు జన్ మత్ సర్వే అంచనా వేసింది. బీజేపీ 6 నుంచి 7 చోట్ల, ఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లో, ఇతరులు 2 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు జన్ మత్ సర్వే పేర్కొంది. అయితే ఈ సర్వేలన్నీ సెప్టెంబర్ చివరి వారం వరకు చేసినవి.
ఎన్నికలక ఇంకా 50 రోజుల సమయం ఉండడంతో ప్రజల అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వేలను బట్టి తెలుస్తుంది.












Click it and Unblock the Notifications