అస్సాంలో సస్పెండైన ఐఎఎస్ అదికారి హైదరాబాదీ: ఎందుకు?
గౌహతి: అస్సాం ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసిన ఐఎఎస్ అధికారి విఎస్ భాస్కర్ హైదరాబాదుకు చెందినవారు. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఇచ్చిన విందుకి మద్యం సేవించి రావడమే కాకుండా, ఆ విందులో అల్లరి చేసి, సీఎస్ తో అమర్యాదగా ప్రవర్తించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం భాస్కర్‌ను సస్పెండ్ చేసింది.
జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - లెఫ్టెనెంట్ జనరల్ శరత్ చంద్ గౌరవార్థం అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ పిపెర్సేనియా ఇచ్చిన విందులో భాస్కర్ అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. విఎస్ భాస్కర్ తీరుపై అక్కడివారు గుడ్లప్పగించి చూస్తుండిపోయారని అంటున్నారు.

విఎస్ భాస్కర్ అస్సాం - మేఘాలయ క్యాడర్ 1985వ బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం ఆయన పర్యాటక, ఐటి శాఖల అదనపు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. భాస్కర్ డిన్నర్ పార్టీకి తాగి వచ్చి అక్కడి వారు ఇబ్బందికి గురయ్యేలా ప్రవర్తించినందున్నే తీవ్రమైన చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి.
ఆ సంఘటన ఖానాపరాలోని అస్సాం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలాజీ లగల సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్‌లో జరిగింది. అస్సాం ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ గౌరవార్థం ఇచ్చిన విందులో తన హోదాకు తగని రీతిలో విఎస్ భాస్కర్ వ్యవహరించారని, రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే విధంగా ప్రవర్తించారని అధికారిక ప్రకటనలో తెలిపారు.
దాంతో విఎస్ భాస్కర్‌ను సస్పెండ్ చేసినట్లు అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్‌సి దాస్ చెప్పారు. ఆ రాత్రి విఎస్ భాస్కర్ నియంత్రణ లేకుండా వ్యవహరించారని, మద్యం సేవించి చెడుగా ప్రవర్తించారని కూడా అధికారులు వ్యాఖ్యానించారు. ఎవరు చెప్పినా విఎస్ భాస్కర్ వినిపించుకోలేదని కూడా అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన భాస్కర్ కేంద్రం నుంచి డిప్యుటేషన మీద హైదరాబాద్ వచ్చి 2009 నుంచి 2012 వరకు ఆధార్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఆ సమయంలో మద్యం సేవించి తోటి మహిళా అధికారితో అమర్యాదగా ప్రవర్తించడంతో భాస్కర్‌ను బదిలీ చేయాలని క్యాట్ తీర్పునిచ్చింది.












Click it and Unblock the Notifications