Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Raja Singh: రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తారా.. టికెట్ ఆయనకే వస్తుందా..

ఓ మతానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేతపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి టికెట్ ఇస్తారా అనే తెలియడం లేదు. అయితే గోషామహల్ కు సంబంధించి మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన అక్కడ ప్రచారం కూడా మొదలు పెట్టారు. తనకే టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకే టికెట్ ఇస్తారని పార్టీలో పలువురు చర్చించుకుంటున్నారు.

ఏడాది క్రితం హైదరాబాద్ కు వివాదాస్పద కమెడియన్ మునావర్ ఫారుఖీ రావడానికి అనుమతించిన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ, మహమ్మద్ ప్రవక్త పై రాజా సింగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత పోలీసులు రాజా సింగ్ పై పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేశారు. జైలుకు వెళ్లిన రాజా సింగ్ బెయిల్ పై బయటకు వచ్చారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన కోరుతూ వస్తున్నారు. అయినప్పటికీ బీజేపీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Raja Singh

దీంతో రాజా సింగ్ బీఆర్ఎస్ చేరుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ తాను ప్రాణం ఉన్నంత వరకు సెక్యూలర్ పార్టీల్లోకి వెళ్లబోనని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయించడానికి ప్రయత్నాలు చేశారు. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసే సమయంలోనే పార్టీ అధ్యక్షుడి మార్పుతో ఆ విషయం మరుగున పడింది.

మరోవైపు బీజేపీ తొలి జాబితా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జాబితా విడుదల చేస్తారంటూ వార్తలు వస్తున్నా.. అధికారికంగా అయితే ఆ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లో కూడా పోటీ చేయనున్నట్లు సమాచారం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+