ట్విస్ట్: అత్తింటివేధింపులతోనే ఆత్మహత్య, సూసైడ్ కు ముందు స్వాతి సెల్పీ వీడియో

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనగరి:'స్వాతి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. తన భర్త, అత్త, మామలను తనను వేధించారని స్వాతి ఆరోపించారు.ఆస్తి కోసమే తనను వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే ఆత్మహత్యకు ముందు ఆమె సెల్పీ వీడియోను రికార్డ్ చేసింది.

నరేశ్ ఎక్కడ?, స్వాతిని ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టారు: హైకోర్టు సీరియస్

ఆత్మహత్య చేసుకొనే ముందు స్వాతి సెల్పీ వీడియో రికారక్గింగ్ చేసింది. అయితే తన భర్త, అత్తింటివారు తనను ఇబ్బందిపెట్టారని ఆమె ఆ వీడియోలో ఆరోపించారు. తాను ఇంటినుండి వెళ్ళిపోయినా కాని తన తల్లిదండ్రులు ఏమనలేదన్నారు.అయితే ప్రేమే సర్వస్వమని భావించి నరేష్ తో కలిసి వెళ్తే లాభం కంటే నష్టమే జరిగిందని ఆమె ఆరోపించారు.

swati suicide

వివాహాం చేసుకొని నెలరోజులు కూడ కాముందే పిల్లలు ఎలా పుడతారని ఆమె ప్రశ్నిస్తోంది.తప్పుడు ప్రచారం ద్వారా తనను ఇబ్బంది పెట్టారని బాధితురాలు అత్త, మామ, భర్తపూ ఆరోపణలు చేసింది.

తన వాటా కింద ఎంత ఆస్తి వస్తుండనే పదేపదే తనను తన భర్త ప్రశ్నించేవాడని ఆమె చెప్పారు.అయితే ఈ వీడియోను పోలీసులు పరీక్షించ,నున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసు మిస్టరీని చేధించనున్నట్టు పోలీసులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Swathi recorded selfie video before death . she made allegetions on her husband and his family. police enquiry on that selfi video also.
Please Wait while comments are loading...