చిన్నోడివని చెప్పా! అయినా వదల్లేదంటూ యువతిలా..
ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది ఈ ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకొంది.
మహబూబాబాద్: ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది ఈ ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకొంది. ప్రియుడి వయస్సు తన కన్నా తక్కువ అని చెప్పినా వినకుండా ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
మహబూబాబాద్ శివారులోని ఆకుల లక్ష్మయ్య కాలనీలో ప్రియుడు బోడ సురేష్ ఇంటి ముందు ప్రియురాలు స్వాతి ధర్నాకు దిగింది. సురేష్ పీజీ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నారు.అయితే అదే ప్రాంతానికి చెందిన యాసారావు స్వాతి అనే యువతి హైద్రాబాద్ లో బ్యూటీషీయన్ కోర్సు నేర్చుకొంటుంది.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. నువ్వు నా కంటే వయస్సులో చిన్నవాడివి అని ఎంతచెప్పినా వినకుండా తన వెంటపడ్డారని స్వాతి చెబుతోంది. రెండేళ్ళపాటు హయిగా వారి ప్రేమాయణం సాగింది.
అయితే వీరిద్దరి మధ్య సంబంధం కారణంగా ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో ఆ యువకుడు ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తీసుకెళ్ళి గర్బస్రావం చేయించాడని బాధితురాలు ఆరోపించారు. అప్పటి నుండి ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
ఈ విషయమై సోమవారం నాడు ప్రియుడు సురేష్ ఇంటి ముందు బాధితురాలు దీక్షకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు కూడ మద్దతుగా నిలిచాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications