తెలంగాణా ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెప్తున్న తీపికబురు తెలుసా!
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి డిజిటల్ సేవలను అందించడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ విప్లవానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇకపై 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రానుంది. ఇది ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరిగిన నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఓ మంచి శుభవార్త.
ఇకపై ప్రతీ ఇంటికి ఇంటర్నెట్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీ ఫైబర్ ఆధ్వర్యంలో దశలవారీగా గ్రామీణ ప్రాంతాలలోని ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిఇంటికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు టీ ఫైబర్ ద్వారా హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవలు అందించనున్నారు. ఈ మేరకు టీ ఫైబర్ నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్ నుంచి ఈ వ్యవస్థను పర్యవేక్షించనున్నారు. రాష్ట్రంలోని లక్షల ఇళ్లకు దశలవారీగా ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించబోతుంది.

మొదటి విడతలో 2096 గ్రామాలకు ఇంటర్నెట్
ఈ ఇంటర్నెట్ సౌకర్యంతో వర్చువల్ నెట్వర్క్ తో పాటు, టెలిఫోన్, తెలుగు ఓటీటీలను గ్రామీణ ప్రాంతాల ప్రజలు తిలకించడానికి అవకాశం ఉంటుంది. అయితే మొదటి విడతలో భాగంగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాలలోని 2096 పంచాయతీలలో ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు దీనిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆపై మిగిలిన గ్రామాలలోనూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాన్ని తెలంగాణాలో అమలు చేసే యత్నం
దేశంలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో పథకాన్ని ప్రారంభించగా దీనిలో తెలంగాణ రాష్ట్రానికి 2500 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం కోసం కసరత్తులు చేస్తున్నారు. కేవలం 300 రూపాయలకే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
విద్యార్థులకు బాగా ఉపయుక్తంగా ఈ డిజిటల్ సేవలు
20 ఎంబిబిఎస్ స్పీడుతో ఈ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ కనెక్షన్ ద్వారా విద్యార్థులు టీవీలను కంప్యూటర్లుగా మార్చుకొని వాటి ద్వారా కావలసిన సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ కనెక్షన్ తీసుకున్న వారితో హైదరాబాద్ నుంచే సీఎం నేరుగా మాట్లాడవచ్చని కూడా అధికారులు చెబుతున్నారు.
ఇకపై పల్లె పల్లెనా ప్రతి ఇంటికి ఇంటర్నెట్
ప్రతి గ్రామంలోనూ జంక్షన్లు, తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా ఈ ఫైబర్ నెట్ తో అనుసంధానం చేసి ప్రతి పోలీస్ స్టేషన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వీటిని అనుసంధానం చేస్తారు. ఇక మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పల్లె పల్లెనా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలను విస్తరించడానికి శ్రీకారం చుడుతోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications