మహిళా టీవీ యాంకర్‌పై చేయి చేసుకున్న సిరియన్, ఆమె భర్తపై కూడా
హైదరాబాద్: ఓ మహిళా టీవీ యాంకర్, ఆమె భర్తపై సిరియా దేశస్థుడు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్ చౌరస్తా సిగ్నల్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
చిక్కడపల్లి పోలీసుల కథనం ప్రకారం.. ఓ టీవీ ఛానల్‌లో పనిచేస్తున్న శివజ్యోతి, ఆమె భర్త ముత్యం మంగళవారం ఉదయం గం. 9.30లకు బైక్‌పై ఆర్టీసి క్రాస్ రోడ్డు నుంచి ఇందిరాపార్కు మీదుగా తమ ఆఫీసుకు వెళ్తున్నారు.
ఆ సమయంలో అశోక్‌నగర్ చౌరస్తా వద్ద సిగ్నల్ పడడంతో ఆగారు. వెనుకనే ఉన్న సిరియా దేశస్థుడు సాద్ అబ్దుల్ మున్నమ్ అబ్‌ఫాయస్ (25) యాంకర్ శివజ్యోతి బైక్‌ను వెనక్కు జరపమన్నాడు.

సిగ్నల్ పడింది కదా కొద్ది సెకన్లలో వెళ్లిపోవచ్చు కాస్త వెయిట్ చేయమని కోరింది. దీంతో ఆగ్రహానికి గురైన సాద్ అబ్దుల్, యాంకర్ శివజ్యోతి చెంపపై కొట్టాడు. భర్త ముత్యం అడ్డుకోగా అతనిపై కూడా చేయి చేసుకొని తీవ్రంగా గాయపరిచాడు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలిసిన చిక్కడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబ్దుల్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఇనె్స్పక్టర్ సుదర్శన్ తెలిపారు.












Click it and Unblock the Notifications