టీ కాంగ్రెస్ నేతల కీలక నిర్ణయాలు - ఇక ఉమ్మడిగా..!!

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా పార్టీ నేతలు సమావేశం అయ్యారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.

త్వరలో బస్ యాత్ర ఉంటుందని.. దీనిపై పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 30న ప్రియాంక సభకు నిర్ణయించారు. మహిళా డిక్లరేషన్ ప్రకటకనకు డిసైడ్ అయ్యారు. పార్టీ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

T congress leaders planning for Bus yatra, Announces count down for Assembly Elections

ఎన్నికల దిశగా మరింత వేగంగా అడుగులు వేసేవిధంగా నిర్ణయాలు ఉండాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో పార్టీ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రస్థాయిలో నేతలంతా ఐక్యంగా వుండాలన్న మెసేజ్‌ ప్రజల్లోకి బలంగా పంపాలని తలపెట్టారు.

పదేళ్ళ తర్వాతైనా అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుందని భేటీలో పలువురు అభిప్రాయపడడంతో ఐక్యతారాగం అందుకున్నట్లు బోధపడుతోంది. అదేసమయంలో జరగబోయే ఎన్నికలను ఓ యుద్దంలా భావించి పోరాడాలని టీ.కాంగ్రెస్ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.

T congress leaders planning for Bus yatra, Announces count down for Assembly Elections

అటు సంగారెడ్డిలో కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని నిర్ణయించారు. 2004 ఎన్నికల్లో ఆనాటి విపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసినట్లుగా ఈ ఎన్నికలకు ముందు టీ.కాంగ్రెస్ కీలక నేతలంతా కలిసి బస్సు యాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు.

అయితే, దీనికి సంబంధింని రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకట రెడ్డి వెల్లడించారు. అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుందని భేటీలో పలువురు అభిప్రాయపడడంతో నేతలంతా ఐక్యత ప్రదర్శిస్తున్నారు. ప్రియాంక పాల్గనే సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+