సెటిలర్స్ కు ప్రాధాన్యం - సినీ ఇండస్ట్రీకి భరోసా, కాంగ్రెస్ కొత్త స్కెచ్..!!

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. తెలంగాణలో గణనీయంగా ఉన్న సెటిలర్స్ ను తన వైపు తిప్పుకుంటోంది. ఇప్పుడు కొత్త వ్యూహం సిద్దం చేస్తోంది. సెటిలర్స్ కు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇదే సమయంలో సినీ పరిశ్రమ సమస్యలపైన కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. సెటిలర్స్ తో పాటుగా సినీ పరిశ్రమకు చెందిన వారికి టకెట్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు.

ఎన్నికల వేళ కాంగ్రెస్ కొత్త ప్రణాళికలతో సిద్దం అవుతోంది. బీఆర్ఎస్ పై వ్యతిరేకంగా ఉన్న మెజార్టీ ఓట్ బ్యాంక్ ను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. రాజధాని హైదరాబాద్ తో పాటుగా సరిహద్దు జిల్లాలు..నిజామాబాద్ లో సెటిలర్ల ప్రభావం ఎక్కవ. పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు.

గత తొమ్మిదేళ్ల కాలంలో రాజకీయంగా వారికి ఎటువంటి అవకాశాలు దక్కలేదు. హైదరాబాద్ ఇమేజ్ పెంచటంలో వారంతా భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో సెటిలర్లకు టికెట్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదే సమయంలో మంత్రివర్గంలోనూ స్థానం కల్పించాలని యోచిస్తోంది. సెటిలర్లకు ప్రాధాన్యత దక్కేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది.

T Congress

హైదరాబాద్ కు సినిమా పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత తమదేనని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.రాష్ట్ర విభజన తరువాత సినీ పరిశ్రమ సమస్యలు..కార్మికుల కష్టాల పైన ప్రభుత్వం ఆలోచన చేయలేదు. సినీ పరిశ్రమకు నంది అవార్డులు ఇప్పటి వరకుఇవ్వని నిస్సహాయ స్థితిలో ఉంది. సినీ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి వచ్చే గుర్తింపును విస్మరించింది.

సినిమా ఈవెంట్స్ కు హాజరవ్వటం మినహా..పరిశ్రమను మరింతగా వేగంగా ముందుకు వెళ్లేలా ఎటువంటి నిర్ణయాలు లేవు. ఈ సమయంలో కాంగ్రెస్ మరోసారి సినీ పరిశ్రమ పైన దృష్టి సారించింది. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలోనే పరిశ్రమకు అవసరమైన భూములు... రాయితీలు..ప్రోత్సాహాకాలతో అండగా నిలిచింది. దీనిని ఇప్పుడు తిరిగి కొనసాగిస్తామని చెబుతోంది.

T Congress

సినీ పరిశ్రమపైనా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయంగా ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించాలని భావిస్తోంది. టికెట్ల కేటాయింపుతో పాటుగా మంత్రివర్గంలోనూ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్న సినీ కార్మికుల ఇళ్ల స్థలాల విషయంలోనూ కాంగ్రెస్ సానుకూలంగా ఉంది.

T Congress

ఇప్పటికే ఈ సమస్య పరిష్కారం దిశగా అభిప్రాయ సేకరణ...ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరగకుండా స్థలాలు అందించే కార్యాచరణ పైన కసరత్తు చేస్తోంది. కొందరు సినీ ప్రమఖులు ఇప్పుడు పార్టీ నాయకత్వంతో టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇలా ప్రతీ వర్గాన్ని తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+