ఐటీ, డిజిటలీకరణ అభివృద్ధికి పథకాలు: బెంగళూరులో కెటిఆర్, 5న టీ హబ్(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, డిజిటలీకరణకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి కె తారకరామారావు తెలిపారు. గురువారం బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రంలో మూడు రోజుల ఐటీ ప్రదర్శన- సీబీటీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాదు నగరం ఇప్పటికే సమాచార సాంకేతిక రంగంలో ప్రగతి బాటలో పయనిస్తోందని, కొత్త రాష్ట్రంగా అవతరించాక కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించేందుకు వివిధ పథకాల్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న టీ-హబ్‌, టాస్క్‌ కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు.

విద్యా సంస్థలు, పరిశ్రమల సమన్వయంతో రాష్ట్రంలో కౌశల్యాభివృద్ధి కార్యక్రమాల్ని అమలు చేస్తున్నామన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంట్లో కనీసం ఒకరు కంప్యూటర్‌ పరిజ్ఞానం పొందాలనే లక్ష్యాన్ని నిర్ధారించినట్లు తెలిపారు.

‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి' అనే నినాదంతో పనిచేసే టీ హబ్‌ను నవంబర్ 5న రతన్‌టాటా ప్రారంభించనున్నారని మంత్రి కెటిఆర్ ప్రకటించారు. ఇది దేశంలోనే అతి పెద్ద ఐటీ ఇంక్యుబేటర్ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఐటీ రంగంలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండేందుకు ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్ కార్పెట్ నినాదంతో ముందుకెళ్తున్నామని.. ఇదే టీ హబ్‌కు స్ఫూర్తి అని వెల్లడించారు. తెలంగాణలో వినూత్న ఆలోచనలతో ఐటీ రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నట్టు చెప్పారు. ఇందులోభాగంగానే టాస్క్, టీ హబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, డిజిటలీకరణకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి కె తారకరామారావు తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

గురువారం బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రంలో మూడు రోజుల ఐటీ ప్రదర్శన- సీబీటీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

కెటిఆర్

కెటిఆర్

బయోకాన్ సంస్థ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. టీ హబ్, టాస్క్ తదితర అంశాలపై మజుందార్ షాతో మంత్రి చర్చించారు.

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను కూడా మంత్రి ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం. భేటీ సందర్భంగా చార్మినార్ జ్ఞాపికను మజుందార్‌షాకు కెటిఆర్ అందజేశారు.

ఐటీ పరిశ్రమల్లో నిలదొక్కునేందుకు విద్యార్థులకు కావాల్సిన నైపుణ్యాన్ని అందిస్తున్న తమ ప్రయత్నం దేశంలోనే మొదటిదని స్పష్టం చేశారు. మూడు రోజులపాటు జరిగే సీఈబీఐటీ కాన్ఫరెన్స్‌కు 66 దేశాల నుంచి వేలమంది ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో మంత్రి కేటీఆర్‌తోపాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+