వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధాన్యం కొనుగోలులో టీ సర్కార్ ఘోర విఫలం.!తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైయస్సార్ షర్మళ పార్టీ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలులో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని వైఎస్.షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ ఆరోపించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేక అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారన్నారని, ఓ వైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుంటే, మరోవైపు కాంటా వేయడం లేటవుతుండటంతో, చాలా చోట్ల ధాన్యం మొలకలెత్తుతున్నాయన్నారు ఇందిర. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి కన్నెర చేస్తుండటంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఇందిరాశోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం బాద్యత వహిస్తుందా అని సూటిగా ప్రశ్నించారు ఇందిర.

తరుగు పేరుతో రైతన్నను ముంచుతున్న మిలర్లు.. దిక్కుతోచని స్ధితిలో రైతులు..

తరుగు పేరుతో రైతన్నను ముంచుతున్న మిలర్లు.. దిక్కుతోచని స్ధితిలో రైతులు..

తరుగు పేరుతో ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అటు మిలర్లు రైతన్నను నిలువుదోపిడీకి గురి చేస్తున్నారని ఇందిరాశోభన్ మండిపడ్డారు. అసలు ధాన్యం కొనుగోలు విషయంలో రైతుకు ప్రభుత్వానికి మాత్రమే సంబంధమని, మధ్యలో మిల్లర్ల అజమాయిషీ ఏంటని ఆమె ప్రశ్నించారు. ధాన్యం కాంటా వేశాక రవాణాకు లారీలు లేవని చెప్పడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. గులాబీ పార్టీ మీటింగులకు వేలకు వేల వాహనాలను సమకూర్చుకునే టీఆర్ఎస్ నేతలు రైతు పండించిన ధాన్యాన్ని తరలించేందుకు ఎందుకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం లేదని ఇందిరా శోభన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు.. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్న వైసీపి..

కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు.. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్న వైసీపి..

ధాన్యం నింపేందుకు గోనె సంచులు కూడా సిద్దంచేయలేదంటూ శుక్రవారం నిన్న వరంగల్ రూరల్ జిల్లా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లితో సాక్షాత్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వాగ్వాదానికి దిగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. పంటను అమ్ముకునేందుకు రైతులు ఎంతలా కష్టపడుతున్నారో చెప్పేందుకు మాటలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు ఇందిర. తాము జోక్యం చేసుకుని స్పందిస్తే ప్రతిపక్షాలవి ఆరోపణలు అనే మీరు, స్వయంగా సొంత గులాబీ పార్టీ మీ ఎమ్మెల్యే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని ఇందిరా శోభన్ ప్రశ్నించారు.

మూడు వారాలు దాటితే గానీ ధాన్యం కాంటా వేయని వైనం.. సమస్యల్లో చిక్కుకుపోతున్న రైతు..

మూడు వారాలు దాటితే గానీ ధాన్యం కాంటా వేయని వైనం.. సమస్యల్లో చిక్కుకుపోతున్న రైతు..

రైతులు పండించిన ప్రతి గింజను కొనేంత వరకు, కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. వ్యవసాయం అంటే దండగ కాదు పండగని గతంలో తన హయాంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి చేసి చూపించారని, తెలంగాణలో మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృత్తం అయ్యేలా చూడాలన్నారు. ఇప్పటికైనా, అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఇందిరాశోభన్ కోరారు. ఇప్పటికైనా కల్లాల్లో ఉన్న పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించే క్రమంలో వేగం పెంచాలని, ఈదురు గాలులు వస్తే దాన్యం మీద కప్పిన కవర్లు కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి సాద్యమైనంత త్వరలో ధాన్యాన్ని తరలించాలని
ఇందిరా శోభన్ డిమాండ్ చేసారు.

డబ్బులు జమవ్వడంలో ఆలస్యం.. అవస్థలు పడుతున్న అన్నదాతలు

డబ్బులు జమవ్వడంలో ఆలస్యం.. అవస్థలు పడుతున్న అన్నదాతలు

ఇవన్నీ ఇలా ఉండగా అటు మిల్లర్ల వద్ద రైతులు మరో నరకం అనుభవిస్తున్నారని ఇందిరా శోభన్ పేర్కొన్నారు. ధాన్యాం కొనుగోలు కేంద్రాలకు చేరాక 20 రోజులు దాటితే తప్ప రైతుల ఖాతాల్లో డబ్బులు జమకావడం లేదని ఆమె విమర్శించారు. అప్పులు చేసి పంట పండించిన రైతు కష్టార్జితానిక ఫలితం దక్కడానికి కూడా రైతన్న ఎదరుచూడాల్సిన పరిస్ధితులు తెలెత్తాయని ఇందిరా శోభన్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతు పండించిన ధాన్యం కొలుగోలు తర్వాత ఒక వారం రోజులలోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఇందిరా శోభన్ విజ్ఞప్తి చేసారు.

English summary
Indira Shobhan, a key supporter of YS Sharmila, alleged that the Telangana government had completely failed in purchasing grain. She said that the foodgrains were in dire straits as they could not sell their hard-earned produce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X