తెలంగాణ మహానాడుకు మోత్కుపల్లి గైర్హాజరు, ప్రభుత్వంపై మండిపడిన ఎల్ రమణ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం టీడీపీ పని చేస్తోందన్నారు. టీడీపీ పుట్టిన నాటి నుంచి బడుగుల అభివృద్ది కోసం పని చేస్తోందన్నారు.
Recommended Video

తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం చూడలేక నాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో మినీ మహానాడు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో ధన దోపిడి పెరిగిందని, అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని, సామాజిక న్యాయం కొరవడిందన్నారు.

ఈ ప్రభుత్వంలో ఒకటి రెండు సామాజిక వర్గాలకే అధికారం పరిమితమైందని ఆరోపించారు. మహిళలకు కేబినేట్‌లో స్థానం ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. రాబోయే ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతున్నాయనడానికి కర్ణాటకనే నిదర్శమన్నారు.
మహానాడుకు మోత్కుపల్లి గైర్హాజరు
తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడుకు తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గైర్హాజరయ్యారు. ఆయనతో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా రాలేదని తెలుస్తోంది. మోత్కుపల్లి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన తెరాసలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications