Diwali 2024: దీపావళి రోజు ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది గాయాలపాలవుతారు. టపాసులు కాల్చే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్యులు చెబుతున్నారు. సురక్షితంగా ఉండడానికి భద్రతా చర్యలను పాటించమని ప్రజలను కోరుతోంది. దీపావళి అనేది వేడుకలు, కలిసి ఉండే సమయమని కంటి వైద్యులు చెబుతున్నారు. లైట్లు, పటాకులు సమావేశాల మధ్య కొన్ని భద్రతా చర్యలను అనుసరించడం ద్వారా వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
టపాసులకు సంబంధించి ఏవైనా కంటిలోకి ప్రవేశిస్తే, దానిని శుభ్రమైన నీరు లేదా సెలైన్‌తో సున్నితంగా శుభ్రం చేయాలి. ఏ ఇతర పదార్థాలను ఉపయోగించకూడాదు. కన్ను మూసే ఉంచాలి. వైద్యుడి వద్దకు వెళ్లేవరకు శుభ్రమైన, పొడి గుడ్డతో కన్నును కప్పి ఉంచాలి. గాయపడిన కంటిని నొక్కడం లేదా రుద్దడం చేయకూడదు. ఇది గాయాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. కంటిపై లేపనాలు లేదా ఇంట్లో వాడే పదార్థాలు ఉపయోగించడం మానుకోవాలి.

గాయం చిన్నదిగా అనిపించినప్పటికీ, దానిని అలాగే ఉంచి, ఆలస్యం చేయకుండా వైద్యుడికి చూపించాలి. బాణసంచ అధీకృత విక్రేతల నుంచే కొనుగోలు చేయండి. బాణాసంచా పిల్లలకు దూరంగా, మండే వస్తువులకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా పిల్లలు క్రాకర్స్ వెలిగిస్తున్నప్పుడు పెద్దలు దగ్గరుండాలి. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చాలి. వాటిని కాల్చడానికి పొడవైన కొవ్వొత్తులను వాడాలి. నీటి బకెట్లను సమీపంలో ఉంచుకోవాలి. కళ్లకు రక్షణగా అద్దాలు ధరించవచ్చు.

పటాకులన చేతితో పట్టుకుని వెలిగించ్చవద్దు. బాణసంచా కాల్చేటప్పుడు సింథటిక్ లేదా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. బాణసంచ ఎప్పుడూ జేబులో పెట్టుకోకండి. దీపావళిని ఆనందంగా, సురక్షితంగా జరుపుకోండి. హ్యాపీ దీపావళి.












Click it and Unblock the Notifications