తలసాని ఇష్యూ నా పరిధిలో లేదు, తెలంగాణకు ఇంచార్జీనే: భన్వర్‌లాల్
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారం తన పరిధిలో లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ నసీం జైదీని భన్వర్‌లాల్ మంగళవారం కలిశారు.
ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మీడియాతో మాట్లాడారు. తలసాని రాజీనామాపై ప్రశ్నించగా ఆ వ్యవహారం తన పరిధిలో లేదని, టిఆర్ఎస్ ప్రభుత్వానికీ తనకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను ఏపీ క్యాడర్‌కు చెందిన వాడినని, తెలంగాణకు ఇంచార్జ్‌గా మాత్రమే ఉన్నానని భన్వర్‌లాల్ తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుశాతం ఓట్లను తొలగించారని, నిజామాబాద్ జిల్లాలో 26 శాతం ఓట్లను తొలగించారని, తెలంగాణలోని చాలా చోట్ల ఓట్ల తొలగింపు జరిగిందని చెప్పారు. ఓట్ల తొలగింపుపై విచారణ జరిగిపి చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రకటన వస్తే తప్పకుండా తెలియజేస్తానని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కాగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత టిఆర్ఎస్‌లో చేరి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలో చేరారు. ఈ వ్యవహారంపై తీవ్ర వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications