హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘మా ఇల్లు మాఫియా అడ్డానా? నా కుమారుడు డానా?’: చేతులు జోడించిన తలసాని(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారిణి కాల్వ భువనారెడ్డి వివాహ వివాదంలో తన కుటుంబాన్ని అనవసరంగా లాగారని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే తనను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు.

హైదరాబాద్‌లోని తన ఇంట్లో భువనారెడ్డి, ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'మా ఇల్లు మాఫియా అడ్డా.. నా కొడుకు పెద్ద డాన్‌..'అయినట్లు ఓ పత్రికలో చిత్రీకరించారని దుయ్యబట్టారు. తప్పు చేస్తే ఎవరినీ ప్రోత్సహించనని, ఎవరో చేసినదానికి తన పేరు మీడియాలో రాయడం సమంజసం కాదని అన్నారు.

ముప్పై ఏళ్లుగా కష్టపడి పేరు ప్రతిష్ఠలు సంసాదించుకున్నానని, తన పేరుపై ఆరోపణలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని లేదా వివరణ తీసుకొని రాస్తే బాగుంటుందని తలసాని చేతులు జోడించారు. ఒక అంతర్జాతీయ క్రీడాకారిణిని ఇంట్లో ఉంచి తాళం వేసుకుని వెళ్లిన వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేస్తే కనీసం వివరణ తీసుకోకుండా పతాకశీర్షికల్లో ప్రచురించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు.

మీడియాతో..

మీడియాతో..

అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారిణి కాల్వ భువనారెడ్డి వివాహ వివాదంలో తన కుటుంబాన్ని అనవసరంగా లాగారని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రెస్‌మీట్

ప్రెస్‌మీట్

ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే తనను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు.

ప్రెస్‌మీట్

ప్రెస్‌మీట్

హైదరాబాద్‌లోని తన ఇంట్లో భువనారెడ్డి, ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రెస్‌మీట్

ప్రెస్‌మీట్

ఈ సందర్భంగా భువన తండ్రి మహేందర్‌రెడ్డిని రూ.3 కోట్లు ఇవ్వాలని భువన భర్త అభినవ్‌ అడిగినట్లుగా చెబుతున్న ఆడియో రికార్డింగ్‌ను మీడియా సమావేశంలో వినిపించారు.

ప్రెస్‌మీట్

ప్రెస్‌మీట్

'మా ఇల్లు మాఫియా అడ్డా.. నా కొడుకు పెద్ద డాన్‌..'అయినట్లు ఓ పత్రికలో చిత్రీకరించారని దుయ్యబట్టారు. తప్పు చేస్తే ఎవరినీ ప్రోత్సహించనని, ఎవరో చేసినదానికి తన పేరు మీడియాలో రాయడం సమంజసం కాదని తలసాని అన్నారు.

ప్రెస్‌మీట్

ప్రెస్‌మీట్

ముప్పై ఏళ్లుగా కష్టపడి పేరు ప్రతిష్ఠలు సంసాదించుకున్నానని, తన పేరుపై ఆరోపణలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని లేదా వివరణ తీసుకొని రాస్తే బాగుంటుందని తలసాని చేతులు జోడించారు.

 ప్రెస్‌మీట్

ప్రెస్‌మీట్

ఒక అంతర్జాతీయ క్రీడాకారిణిని ఇంట్లో ఉంచి తాళం వేసుకుని వెళ్లిన వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేస్తే కనీసం వివరణ తీసుకోకుండా పతాకశీర్షికల్లో ప్రచురించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు.

ప్రెస్‌మీట్

ప్రెస్‌మీట్

దాడి ఘటనలో ‘మీ కొడుకుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది కదా' అని మీడియా ప్రశ్నించగా.. తన కొడుక్కి ఆ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని, ఫిర్యాదు వస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని నిబంధనలు చెబుతున్నాయని, వాస్తవాలు దర్యాప్తులో తేలుతాయని తలసాని సమాధానమిచ్చారు.

ప్రెస్‌మీట్

ప్రెస్‌మీట్

ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌ తనను కొట్టాడంటూ భువనారెడ్డి భర్త అభినవ్‌ కేసు పెట్టిన విషయం తెలిసిందే.

దాడి ఘటనలో ‘మీ కొడుకుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది కదా' అని మీడియా ప్రశ్నించగా.. తన కొడుక్కి ఆ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని, ఫిర్యాదు వస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని నిబంధనలు చెబుతున్నాయని, వాస్తవాలు దర్యాప్తులో తేలుతాయని తలసాని సమాధానమిచ్చారు. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌ తనను కొట్టాడంటూ భువనారెడ్డి భర్త అభినవ్‌ కేసు పెట్టిన విషయం తెలిసిందే.

నన్ను పంపించేందుకు రూ.3 కోట్లు అడిగాడు: భువన

జిమ్‌లో ఏర్పడిన పరిచయంతో అభినవ్‌ను పెళ్లి చేసుకున్నానని భువనారెడ్డి తెలిపారు. 'నన్ను ఇంటికి పంపించేందుకు రూ.3 కోట్లు చెల్లించాలని మా నాన్నను అడిగాడు. లేదంటే ఆస్తి అయినా రాసివ్వమన్నాడు. అతడితో ఉన్నన్ని రోజులు చిత్రహింసలకు గురి చేశాడు. నన్ను ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లేవాడు. అతడికి అంతకుముందే మరో వివాహం అయిందని తర్వాత తెలిసింది. నా ముందే మా నాన్నని విపరీతంగా కొట్టాడు' అని వివరించారు.

ఈ సందర్భంగా భువన తండ్రి మహేందర్‌రెడ్డిని రూ.3 కోట్లు ఇవ్వాలని అభినవ్‌ అడిగినట్లుగా చెబుతున్న ఆడియో రికార్డింగ్‌ను మీడియా సమావేశంలో వినిపించారు. కాగా, అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ అభినవ్‌పై ఆయన భార్య భువనారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.

English summary
Telangana minister Talasani Srinivas Yadav on Sunday responded on his son's case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X