తలసాని.. ఏందీ పైత్యం?: ఇంత దిగజారాలా!, ఆ మాట వదిలిపెట్టవా?..

నోటికొచ్చినట్లు విమర్శించి.. అంతమాత్రానికే జనంలో ఇమేజ్ పెరిగిపోతుందనుకుంటే.. దాన్ని మించిన పొరపాటు ఉండదు. సరిగ్గా తలసాని కూడా ఇప్పుడదే పొరపాటు చేస్తున్నారు.

హైదరాబాద్: మైకులు దొరికితే స్పీచులు దంచే నేతలకు రాజకీయాల్లో కొదువ లేదు. మాటల గారడీలు ప్రదర్శించేందుకు.. మాస్ డైలాగులతో జనాన్ని ఆకట్టుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు. ప్రసంగం ఆద్యంతం జనం తమ దృష్టి మరల్చుకోవద్దని తహతహలాడుతుంటారు. ఈ క్రమంలో అసలు సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అయి వ్యక్తిగత టార్గెట్లకు పరిమితమవుతారు.

కొన్నిసార్లు ఆ భాష మరింత తీసికట్టుగా తయారై.. జనాన్ని సైతం నోరెళ్లబెట్టేలా చేస్తుంది. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం దిగజారుడు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. షాద్ నగర్‌లో గొర్రెల అభివృద్ది పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. అసలు విషయాన్ని పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలతో విరుచుకుపడ్డారు.

అదే బురద పూసుకుంటున్నారు:

అదే బురద పూసుకుంటున్నారు:

మాట్లాడితే.. 'కొడుకులు', 'నాలుక చీరేస్తరు' అన్న పదాలు ఉపయోగించి మీడియాలో ఫోకస్ అయ్యారు తప్పితే.. జనం దృష్టిలో తలసాని చులకనైపోయారు. ప్రత్యర్థులు దిగజారుడు వ్యాఖ్యలు చేసినంత మాత్రానా.. తాము కూడా అదే బురద పూసుకుంటామన్న రీతిలో ఆయన వ్యవహరించడం గమనార్హం. ఉత్తమ్ కుమార్ రెడ్డిని గడ్డపోడు అని, రేవంత్ రెడ్డిని తుపాకీ రాముడు అని తలసాని చేసిన వ్యాఖ్యలు సభలో ఈలలు వేయించేలా చేసి ఉండవచ్చు కానీ రాజకీయంగా మాత్రం దిగజారుడు తనాన్ని బయటపెట్టుకున్నట్లే లెక్క.

రేవంత్ రెడ్డిది అదే తంతు:

రేవంత్ రెడ్డిది అదే తంతు:

నిజానికి రేవంత్ రెడ్డి లాంటి ప్రత్యర్థులు అంతకన్నా దిగజారుడు స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. కేసీఆర్ తో రాజకీయంగా తలపడాల్సింది పోయి.. వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని పదేపదే విమర్శల్లోకి లాగడం జనం గమనిస్తూనే ఉన్నారు. ఆఖరికి కేసీఆర్ మనువడిపై సైతం రేవంత్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు ఆయన నైజానికి నిదర్శనం.

నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇమేజ్ పెరుగుతుందా?

నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇమేజ్ పెరుగుతుందా?

నోటికొచ్చినట్లు విమర్శించి.. అంతమాత్రానికే జనంలో ఇమేజ్ పెరిగిపోతుందనుకుంటే.. దాన్ని మించిన పొరపాటు ఉండదు. సరిగ్గా తలసాని కూడా ఇప్పుడదే పొరపాటు చేస్తున్నారు. నిన్నటి సభలో రేవంత్ రెడ్డిని తుపాకీ రాముడని, పిసికితే ప్రాణం పోతదని.. తలసాని ఏవేవో కామెంట్స్ చేశాడు. ఈ లెక్కన రేవంత్ కు తలసానికి పెద్ద తేడా ఏముంది?.. దిగజారుడు వ్యాఖ్యలు చేయడంలో ఇద్దరూ ఇద్దరే అనిపించుకుంటున్నారు.

ఇంకెంత కాలమో?:

ఇంకెంత కాలమో?:

తలసాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. 'కొడుకులు' అన్న పదం ఆయన నోటి నుంచి ఊతపదంలా మాటిమాటికీ ఊడిపడుతూనే ఉంటుంది. జనం ఏమనుకున్నా సరే ఆయన మాత్రం అదే మాట తీరును కొనసాగిస్తున్నారు. రాజకీయాలంటేనే.. దిగజారుడుతనం అని కొత్త భాష్యం చెబుతున్నారు. చూడాలి మరి.. ఈ పరంపర ఇంకెంత కాలం కొనసాగుతుందో?..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+