కేసీఆర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందనలు
చెన్నై/హైదరాబాద్: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి(ఏప్రిల్ 14) సందర్భంగా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం అభినందించారు.
'బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రికి అభినందనలు. బుద్ధుని విగ్రహం, తెలంగాణ సచివాలయం మధ్య సమానత్వానికి ఒక పెద్ద చిహ్నంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఉంచాలనే ఆలోచన సరైనది, విస్మయం కలిగిస్తుంది' అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.

స్టాలిన్, కేసీఆర్ ఇద్దరూ ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని కేంద్రంతో అనేక విషయాలపై విభేదిస్తున్న విషయం తెలిసిందే. హిందీ విధింపు, రాష్ట్ర హక్కుల వంటి కొన్ని సమస్యలపై బీఆర్‌ఎస్, డీఎంకేలు ఏకీభవించాయి.
Congratulations to Hon @TelanganaCMO on unveiling the 125 ft bronze statue of Babasaheb Dr. Ambedkar on his birth anniversary.
— M.K.Stalin (@mkstalin) April 15, 2023
The thought of placing Ambedkar's statue as a giant symbol of equality between the Buddha statue and Telangana Secretariat is apposite & awe-inspiring. https://t.co/5ERpliXxSc
దాదాపు 465 టన్నుల బరువున్న ఈ విగ్రహం 50 అడుగుల ఎత్తు ఉన్న పీఠంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముఖ్యమైన జీవిత సంఘటనలను ప్రదర్శించే మ్యూజియం, గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్ భవనం పక్కనే ఈ విగ్రహం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications