గవర్నర్ పదవికి రాజీనామాపై స్పందించిన తమిళిసై సౌందరరాజన్: ఏమన్నారంటే?
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై స్పందించారు తమిళిసై సౌందరరాజన్. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాను ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు సోదరినే అని చెప్పారు. తనపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
కాగా, సోమవారం ఉదయం గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవితో పాటు అదనపు బాధ్యతల్లో ఉన్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికీ కూడా రాజీనామా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు వీలుగా తమిళిసై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సోమవారం ఉదయం గవర్నర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమిళిసై సౌందరరాజన్.. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ పోటీ చేసే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు తమిళిసై చెన్నై వెళ్లారు.
కాగా, తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్.. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండో గవర్నర్‌గా తమిళిసై బాధ్యతలు స్వీకరించారు. ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్రానికి చెందిన అప్పటి ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
అనంతరం 2021 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు తమిళిసై. అయితే, గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై.. 2019 ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి లోక్‌సభకు పోటీ చేసి.. కరుణానిధి కుమార్తె కణిమొళిపై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్‌గా భారత రాష్ట్రపతి నియమించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications