రేవంత్‌రెడ్డికి ఆ దమ్ముందా..? ప్రముఖ నిర్మాత ఫైర్
తెలంగాణ రాజకీయాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ అక్రమంగా చెరువును అక్రమించి నిర్మించారని తేలడంతో అధికారులు శనివారం దాన్ని కూల్చేశారు. దీనిపై స్పందించిన నాగార్జున.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు.స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు.
దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఈ విషయంలో తగ్గేదెలే అని తేల్చి చెప్పాడు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. తాజాగా ఈ వివాదంపై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. కూల్చడం స్టార్ట్ చేస్తే సగం హైదరాబాద్‌ని కూల్చేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. . నాకు తెలిసినంత వరకు నాగార్జున ఆ ల్యాండ్‌ని కొనుక్కున్నాడు. చెరువు సైడ్ ఉన్న మూడెకరాలు కబ్జా అని, దాన్ని కూల్చామంటున్నారు. అందులో నిజమెంతా అనేది తెలియదు. అయితే అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నీ కూడా ఇలాగే కూలుస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

మోకీలా పరిధిలో చాలా అక్రమనిర్మాణాలు, ఫామ్ హౌజ్‌లు నిర్మించారు. అలా కూల్చుకుంటూ పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్, సీఎం, మాజీ సీఎం, మాజీ సీఎం అమ్మాయి, అబ్బాయి అందరి ఫామ్ హౌజ్‌లు కూల్చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో చాలా చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. యూసఫ్ గూడలో చెరువు ఉండేది. ఇప్పుడు ఓ వైపు కృష్ణకాంత్ పార్క్, మరోవైపు ఇళ్లు వచ్చేశాయి. మరి వాటి సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారితో పాటు, గత ప్రభుత్వంలోని నేతల ఇళ్లు కూడా కూల్చాలని..మరి కూల్చి ధైర్యం సీఎం రేవంత్ రెడ్డి చేస్తారా..? అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఈ విధంగా తమ్మారెడ్డి భరద్వాజ తనదైనశైలిలో అధికార , ప్రతిపక్ష నాయకులకు చురకలు అంటించారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications