Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స‌భ‌కు సమ‌స్కారం..! ఇక తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ లేన‌ట్టే..!!

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ బీట‌లు వారిపోతోంది. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత రోజురోజుకూ ఆ పార్టీ క్రుంగి క్రుషించి పోతోంది. ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్ర‌తిసారి ఓట‌మి పాలై ఉనికిని కోల్పోతోంది. దీంతో పార్టీకి మూల స్థంభాల్లా ఉన్న నేత‌లు కూడా పార్టీని వీడిపోతున్నారు. దీంతో తెలంగాణ లోక్ స‌భ ఎన్నికల్లో ఆ పార్టీ క‌నీసం పోటీకి కూడా దిగ‌డం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల పార్టీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అవుతుందా అంటే, అవుననే విధంగా నిర్ణయాలు ఉంటున్నాయ. మూడున్నర దశాబ్ధాలకు పైగా సుధీర్ఘ చరిత్ర ఉన్న తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయడం లేదని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న శ్రేణులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని పార్టీ పెద్దలు కల్పించారు. అయితే తెలుగుదేశం పార్టీ తొలిసారి తెలంగాణ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

కాల‌క్ర‌మేణా బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌స్తున్న టీడిపి..! తెలంగాణ‌లో మ‌నుగ‌డ క‌ష్ట‌మే..!!

కాల‌క్ర‌మేణా బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌స్తున్న టీడిపి..! తెలంగాణ‌లో మ‌నుగ‌డ క‌ష్ట‌మే..!!

కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని నిలువరించ���ందుకు స్వర్గీయ ఎన్టీఆర్ 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన కొన్ని నెలల వ్యవధిలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీని అధికారంలోకి తెచ్చి సంచలనం సృష్టించారు. ఆ తరువాత పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ వాటికి తట్టుకుని నిలబడింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఏ మాత్రం వెరవకుండా చంద్రబాబు నాయుడు టీడీపీని కాపాడ్డంలో సఫలీకృతులయ్యార���.

బ‌ల‌మైన క్య‌డ‌ర్ ఉన్నా.. నాయ‌కులు లేరు..! ద‌య‌నీయ స్థితిలో టీటిడిపి..!!

బ‌ల‌మైన క్య‌డ‌ర్ ఉన్నా.. నాయ‌కులు లేరు..! ద‌య‌నీయ స్థితిలో టీటిడిపి..!!

ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత, ఉభయ రాష్ట్రాలలో టీడీపీ పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని పలుమార్లు టీడీపీ జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు, కేంద్రంలోని బీజేపీకి బుద్ది చెప్పేందుకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో చేతులు కలిపిన విషయం తెలిసిందే..!

లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు దూరం..! మ‌రింత నీరుగారిని పార్టీ శ్రేణులు..!!

లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు దూరం..! మ‌రింత నీరుగారిని పార్టీ శ్రేణులు..!!

ఖమ్మం జిల్లాలో రెండు సీట్లను గెలిచినప్పటికీ పలు నియోజకవర్గాలలో ఓటు బ్యాంకు పదిలంగానే ఉంద��. కొన్ని నియోజకవర్గాలలో పది నుంచి పదిహేను శాతం మరికొన్ని నియోజకవర్గాలలో ఐదు శాతానికి తగ్గకుండా ఓటు బ్యాంకు ఉంది. టీడీపీకి జాతీయ కమిటీతో పాటు రెండు రాష్ట్రాలకు రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ పోటీలో ఉంటే టీఆర్ఎస్, బీజేపీలకు లాభం చేకూరుతుందనేది పార్టీ పెద్దల వాదన. టీడీపీ పోటీ వల్ల ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ విజయం సులువు అవుతుందని, కాంగ్రెస్ నష్టపోతుందనే అభిప్రాయం నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది.

కార్య‌క‌ర్త‌ల్లో అయోమ‌యం..! పార్టీ క‌ద‌లిక‌ల‌పై శ్రేణుల్లో సందేహం..!!

కార్య‌క‌ర్త‌ల్లో అయోమ‌యం..! పార్టీ క‌ద‌లిక‌ల‌పై శ్రేణుల్లో సందేహం..!!

ఈ వాదన సమర్థించుకునేందుకు బాగానే ఉన్నా, టీడీపీ శ్రేణులు అదిష్టానం సూచ‌న‌ల‌మేర‌కు ప‌నిచేస్తారా అనేదే సందేహంగా మారింది. తాము కాంగ్రెస్ కు మ‌ద్ద‌త్తు ఇచ్చే విష‌యంలో పోటీ నుంచి త‌ప్పుకుంటున్నామ‌ని చెప్పుకొస్తున్న తెలంగాణ టీడిపి ని పార్టీ శ్రేణులు అదే స్థాయిలో విశ్వ‌సిస్తాయా అన్న‌దికూడా ఆస‌క్తిని రేపుతోంది. టీ టీడీపీ నిర్ణయంతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కొద్దిపాటి కార్యకర్తలు కూడా ప్రత్యామ్యాయం చూసుకుంటారనే చ‌ర్చ జ‌రుగుతోంది. రాజ‌కీయ క‌ద‌లిక‌లు లేక‌పోవ‌డంతో తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ అంత‌రించిపోయే ద‌శ‌కు చేరుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+