కెసిఆర్ నొక్కేశారు: అవినీతి టోల్ ఫ్రీ నెంబర్‌కు టిడిపి నేత ఫోన్, రూ.50వేల కోట్లు సంపాదన!
హైదరాబాద్: సహారా ఉద్యోగుల పిఎఫ్ నిధులను యాజమాన్యం, కెసిఆర్ నొక్కేశారని టిడిపి నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. పేద ఉద్యోగుల సొమ్ము దోచుకున్నారని మండిపడ్డారు. అవినీతిలో కెసిఆర్‌ది ప్రథమ స్థానం అన్నారు.
అంతకుముందు ప్రతాప్ రెడ్డి... అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.
సహారా ఉద్యోగుల పీఎఫ్ మినహాయింపు, ఈఎస్ఐ కాంట్రాక్ట్ విషయంలో కెసిఆర్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నందున ఆయనను సిబిఐ ప్రశ్నించిందని, రాష్ట్రంలో కూడా కెసిఆర్, హరీష్ రావు, ఎలుగుబంటి సూర్యానారాయణల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. రెండు రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కెసిఆర్‌కు సిబిఐ ఉచ్చు బిగుస్తోందని మరో టిడిపి నేత రాజారాం యాదవ్ అన్నారు. అవినీతి పేరుతో అమాయకుడైన రాజయ్యను పదవి నుంచి తప్పించారన్నారు.
అవినీతిపై సిబిఐ ప్రశ్నించినా కెసిఆర్ ఎందుకు తప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఉద్యమం సమయంలోనే కెసిఆర్ కుటుంబం రూ.50వేల కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఢిల్లీలో కెసిఆర్ రైతుల సమస్యల పైన చర్చించలేదని మండిపడ్డారు.

వార్డుల విభజనపై లక్ష్మణ్ ఆగ్రహం
జిహెచ్ఎంసి వార్డుల విభజన అశాస్త్రీయమని బిజెపి శాసనసభా పక్ష నేత డాక్టక్ కే లక్ష్మణ్ వేరుగా మండిపడ్డారు. 250 వార్డులకు పెంచుతామని ప్రకటించిన కమిషనర్ 150 వార్డులకు పరిమితం చేయడం సరికాదన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వార్డులను విభజించారన్నారు.
ప్రతిపక్షాలకు పట్టున్న ప్రాంతాల్లో వార్డులను విభజించి టిఆర్ఎస్ బలంగా ఉన్నచోట విభజించలేదని ఆరోపించారు. వరంగల్లో ఉమ్మడి అభ్యర్థి పేరు రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. వరంగల్లో పోటీకి టిడిపి కూడా ప్రయత్నిస్తోందన్నారు. టిడిపితో చర్చించి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.
జిహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన ముసాయిదా విడుదల
గ్రేటర్ హైదరాబాదులో వార్డుల పునర్విభజన ముసాయిదా విడుదలైంది. గ్రేటర్లో 150వార్డులుగా విభజిస్తూ భౌగోళిక సరిహద్దులు నిర్ణయించారు. గతంలోనూ 150 వార్డులు ఉన్నప్పటికీ వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం తగ్గిస్తూ సరిహద్దులు మార్చారు. దీంతో కోర్ ఏరియాలో కొన్ని నియోజకవర్గాల్లో వార్డులు కనుమరుగయ్యాయి. ముసాయిదాపై నవంబర్ 3వ తేదీ వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications