టిఆర్ఎస్ దాడిలో నేతకు గాయాలు: రేవంత్ కోసం కలవరింత, చలించిన యువనేత
హైదరాబాద్/నల్గొండ: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల దాడిలో నల్గొండ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత చందూలాల్ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని చంద్రంపేట మండలంలో జరిగింది. రెండు రోజుల క్రితం ఇది జరిగింది. చందూలాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
భూవివాదాల వల్ల ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆయనకు హైదరాబాదులోని మహాత్మా గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతను తెలంగాణ టిడిపి యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చూడాలని అడుగుతున్నాడని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

చలించిన రేవంత్ రెడ్డి
తనను చూడాలని చందూలాల్ కోరడంతో రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ విషయం తెలియగానే ఆయన తాను వస్తున్నట్లు చందూలాల్ కుటుంబ సబ్యులకు ఫోన్ చేసి చెప్పారు. తాను ఉన్నానని ధైర్యం చెప్పారు.
తక్షణమే తాను బయలుదేరి వస్తున్నానని తెలిపారు. రేవంత్, ఇతర టిడిపి నేతలు ఉదయం చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లారు. చందూలాల్ విషయం తెలియగానే వస్తున్నానని రేవంత్ చెప్పారు.
ప్రభుత్వంపై చెరుకు సుధాకర్ ఆగ్రహం
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ నిప్పులు సోమవారం మండిపడ్డారు. నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ వేదిక, తెలంగాణ రాష్ట్ర విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో రైతులారా... ఆత్మహత్యలు ఆపాలంటూ నిర్వహించిన మహార్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రతిరోజు పదుల సంఖ్యలలో రైతన్నలు నేలరాలుతున్నారని, తెలంగాణ ఉద్యమ ముసుగులో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. రైతుల ఆత్మహత్యలపై అవహేళన చేసే విధంగా మంత్రులు మాట్లాడుతున్నారన్నారు.
ప్రభుత్వ పాలన తుగ్లక్ పాలనలా ఉందని ధ్వజమెత్తారు. కరువుకాటకాలతో అప్పులు తీర్చక, పెట్టుబడులు రాక ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు 10 లక్షల పరిహారం చెల్లించి, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీలో స్పష్టత లేదని, దశల వారిగా మాఫీ చేయడం సరికాదన్నారు. కొత్త రుణాలను ఇచ్చి రైతన్నలకు భరోసా కల్పించాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. రైతులు ఆత్మస్థైర్యంతో పోరాడాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.












Click it and Unblock the Notifications