వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుక్కాని లేని నావ టిడిపి: చంద్రబాబు తెలంగాణను వదిలేశారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నానాటికి దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీని బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలేవీ కనిపించడం లేదు. పార్టీ నుంచి శాసనసభ్యులు, నాయకులు వెళ్లిపోతూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరడం ఒక్కటైతే, ఉన్న రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య సమన్వయమూ సయోధ్య లేదు. తెలంగాణలోని సీనియర్ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో తన పార్టీపై ఆశలు వదులుకున్నట్లేనని భావిస్తున్నారు. ఆయన దాదాపుగా తెలంగాణలో పార్టీని వదిలేసినట్లేననే మాట వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత వరంగల్, మహబూబ్‌నగర్ బహిరంగ సభల ద్వారా పార్టీకి ఊపిరి పోయడానికి చంద్రబాబు ప్రయత్నించారు.

టిఆర్ఎస్‌ను తీవ్రంగా దుమ్మెత్తిపోస్తూ తెలంగాణకు తాను చేసిన మేలును గుర్తు చేస్తూ ప్రజలను పార్టీ వైపు ఆకర్షించే పనిచేశారు. తెలంగాణ పార్టీ కమిటీలను వేసే వరకు కూడా ఆయన కాస్తా చురుగ్గానే కనిపించారు. పార్టీ కమిటీలను వేసి, ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే వరకు కాస్తా చురుగ్గా వ్యవహరిస్తున్నట్లే కనిపించారు.

TDP in Telangana may not survive: Chandrababu not interetsd?

ఆ తర్వాతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును ఆహ్వానించిన తర్వాత తెలంగాణ టిడిపి పట్ల ఆయన పూర్తి ఉదాసినతతో వ్యవహరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ సీనియర్లు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ వంటి నాయకులు ఎవరి దారిన వారు నడుస్తున్నారు. పార్టీ నాయకులను గానీ క్యాడర్‌ను గానీ ఏకతాటిపై నడిపించే నాయకత్వం లోపించినట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని భావించిన చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కూడా ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని అంటున్నారు. తెలంగాణలో పార్టీని అధికారం అందుకునే స్థితికి తేవడం సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు తనకు అత్యంత సన్నిహితులైనవారితో జరిపిన సమావేశంలో ఎప్పుడో నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

తెలంగాణపై దృష్టి పెట్టడం చేతులు కాల్చుకోవడమే అవుతుందని కూడా ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నుంచి శాసనసభ్యులు టిడిపిలోకి క్యూ కడుతున్నా చంద్రబాబు ఏమీ మాట్లాడడం లేదు. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీకి తెలంగాణ భవిష్యత్తు లేనట్లే కనిపిస్తోంది.

English summary
It is said that Andhra Pardesh CM and Telugu Desam party president Nara Chandrabab Naidu is not interested to revive party in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X