తెలంగాణలో మరో ఎంపీటీసీ గెలిచిన టిడిపి, టిఆర్ఎస్ మూడో స్థానం
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరో ఎంపీటీసీ సీటును కైవసం చేసుకుంది. ఓటుకు నోటు కేసు అనంతరం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమని కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు చెబుతున్న విషయం తెలిసిందే.
అయితే, టిడిపి స్థానిక ఎన్నికల్లో ఇటీవల ఎంపీటీసీ, సర్పంచ్‌లు పలుచోట్ల గెలుచుకుంది. తాజాగా భాగ్యనగరంలోని రాజేంద్ర నగర్ మండలంలోను ఎంపీటీసీని గెలిచుకుంది. వట్టినాగులపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వెంకటేష్ 378 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

మరో విషయమేమంటే వట్టినాగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మూడో స్థానానికి పరిమితమైంది.
రాజీనామా ఆమోదించుకో: వెంకటేష్ గౌడ్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ధైర్యం ఉంటే తన శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామా ఆమోదించుకోవాలని టిడిపి నేతలు సవాల్ చేస్తున్నారు. సనత్‌నగర్ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ కూన వెంకటేశ్ గౌడ్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ... తలసాని రాజీనామా ఆమోదింప చేసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications