విద్యార్థినితో అసభ్య ప్రవర్తన: ఉపాధ్యాయుడిపై కేసు
హైదరాబాద్: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడి పైన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వనస్థలిపురంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో అదే పాఠశాలకు చెందిన ఫిజిక్స్ ఉపాధ్యాయుడు హేమ కుమార్ కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
అతని వయస్సు 26. అసభ్యంగా ప్రవర్తిస్తూ అతను వేధిస్తున్నాడు. ఆ విద్యార్థిని ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ విషయమై ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు సదరు ఉపాధ్యాయుడి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల వద్దకు వచ్చారు. వారు కిటికీ అద్దాలు పగులగొట్టారు. పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications