దారి తప్పిన గురువుకు దేహశుద్ధి
దారి తప్పిన గురువుకు దేహశుద్ధి
దారి తప్పిన ఓ గురువుకు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పారు విద్యార్థులు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విట్స్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాలలో చోటుచేసుకుంది. కళాశాల ఎం.బి.ఎ. డిపార్టుమెంట్ లో పనిచేస్తున్న అమీన్ అనే అధ్యాపకుడు.... అదే డిపార్టుమెంట్ లో పనిచేస్తున్న ఓ మహిళా అధ్యాపకురాలితో పాటు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. చాలాకాలంగా ఈ తతంగం సాగుతున్నప్పటికీ.... మహిళా లెక్చరర్... జరిగిన సంగతి తన భర్తకు తెలపడంతో.... విషయం వెలుగులోకి వచ్చింది. సదరు లెక్చరర్ ను విద్యార్థులు నిలదీసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications