స్కూల్లోనే 9వ, తరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

Posted By:
Subscribe to Oneindia Telugu

పెద్దకొత్తపల్లి: ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు రికార్డులు రాసేందకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కామంతో కళ్ళు మూసుకుపోయి తాను పనిచేస్తోన్న ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినిపై నర్సింహ అనే టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో నరసింహ ఉపాధ్యాయుడిగా శిక్షణ పొందుతున్నారు. అంతేకాదు ఆయన బీఈడీ కూడ చేస్తున్నాడు.

Teacher rapes on 9th class student in Peddakottapally

తన రికార్డులు రాసేందుకు ఆదివారం నాడు తొమ్మిదో తరగతికి చెందిన బాలికను పాఠశాలకు రప్రించాడు. బాలిక ఒంటరిగా రావడంతో పాఠశాల గదిలోకి తీసుకెళ్ళి ఆమెపై అత్యాచారం చేశారు.

దీంతో బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్ళి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదుచేశారు. నరసింహ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Narasimna, worikng as a teacher in Peddakottapalli governament school. he raped on 9th class student on Sunday in school premises.
Please Wait while comments are loading...