తివారీ రాసలీలల స్టింగ్ ఆపరేషన్ ఏమిటి: ఎబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఎన్నారై వీడియో
హైదరాబాద్: అప్పట్లో మాజీ గవర్నర్ ఎన్‌డీ తివారీ రాజ్‌భవన్‌లో రాసలీలలు జరుపుతూ పట్టుబడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతితో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారని ఓ ఎన్నారై విజయకేసరి మండిపడ్డారు. ఈ మేరకు యూట్యూబ్‌లో ఆమె దాదాపు 20 నిమిషాల నిడివిగల వీడియోను పోస్ట్‌చేశారు.
2009లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆనాటి గవర్నర్ ఎన్‌డీ తివారీపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన విషయాన్ని విజయకేసరి ప్రస్తావించి, అప్పట్లో తివారీ రాజీనామాకు చంద్రబాబు డిమాండ్‌చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక ప్రైవేట్ చానల్ గవర్నర్ మీద రాజ్‌భవన్‌లో స్టింగ్ ఆపరేషన్ చేస్తే తప్పు లేనప్పుడు ప్రభుత్వ సంస్థ ఏసీబీ ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే తప్పేంటని నిలదీశారు.
చంద్రబాబు బృందానికి, తివారీకి తేడా లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇతరులు చేస్తే వ్యభిచారం తాము చేస్తే సంసారం అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆనాడు తివారీ వ్యవహారంపై బాబు వ్యాఖ్యల క్లిప్పింగ్‌ను కూడా తన వీడియోలో ఆమె పొందుపర్చారు.

"గవర్నర్‌పై ఆరోపణలు నిజమైతే తక్షణమే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిది. లేకపోతే ఆయనను ఆ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రజా జీవితంలో ముఖ్యంగా రాజ్‌భవన్‌లో ఇలాంటిది జరగడం బాధాకరం. దీనిపైన విచారణకు ఆదేశించాలి. ఇక్కడ చూస్తే చాలా సమాచారం వస్తున్నది. ఎంపీలు కూడా ఇన్‌వాల్వ్ అయ్యారని, రాజ్‌భవన్ రాస క్రీడలకు కేంద్రం అయిపోయిందని చాలా నీచంగా వస్తున్నాయి. ఇది చాలా బాధేస్తుంది. దీనిపైన కూడా తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది" అని చంద్రబాబు ఆ క్లిప్పింగ్‌లో అన్నారు.
తివారీపై స్టింగ్ ఆపరేషన్ బయటపడిన వారంలోపే ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేసిన విజయకేసరి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికి 14 రోజులు అవుతున్నా పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. తన అవినీతిని ప్రజాసమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ద్వేషంపెంచుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications