ఆఫీస్‌లోని ఉద్యోగినితో టెక్కీ వివాహేతర సంబంధం, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
హైదరాబాద్: ఓ సాఫ్టువేర్ ఉద్యోగి రాసలీలలను భార్య బయటపెట్టిన సంఘటన హైదరాబాదులో వెలుగు చూసింది. భార్యను, కూతురును ఇబ్బందులకు గురిచేస్తూ మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు సదరు సాఫ్టువేర్ ఉద్యోగి. ఈ విషయం వెలుగు చూడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిరేకల్‌కు చెందిన నాగరాజుకు, బాధిత మహిళకు 2007లో పెళ్లి జరిగింది. కొంతకాలంగా హైదరాబాద్ మీర్‌పేట్‌లో వీరు ఉంటున్నారు. వీరికి ఎనిమిది ఏళ్ల కూతురు ఉంది. నాగరాజు నగరంలోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో టీం లీడర్‌గా పని చేస్తున్నాడు. తన సహోద్యోగినితో నాగరాజు గత కొన్ని నెలలుగా వేరే కాపురం పెట్టాడు.

విషయం తెలుసుకున్న భార్య, అతని బంధువులతో కలిసి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తమకు పదకొండేళ్ల ఏళ్ల క్రితం పెళ్లయిందని, తమకు అన్యాయం చేయొద్దని కాళ్లు పట్టుకొని కోరినా వినలేదని, తన కూతురును, తనను కట్టుబట్టలతో నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేశాడన్నారు.
ఈ ఘటనపై మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశామని, తనకు, తన చిన్నారికి న్యాయం చేయాలని పోలీసులను కోరింది. తనను, కూతురిని వదిలించుకోడానికి నాగరాజు పథకం పన్నాడని తమకు ప్రాణహాని ఉందని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications