మార్ఫింగ్ చేసిన లేడీ టెక్కీ నగ్నఫొటోలు: అరెస్టయిన టెక్కీ ఇతనే
తనకు పరిచయం ఉన్న లేడీ టెక్కీ ఫొటోలను మార్ఫింగ్ చేసి, నగ్నంగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీరును వేధించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు కటకటాల పాలయ్యాడు. తన ప్రేమను, తనతో వివాహాన్ని తిరస్కరించినందుకు ఓ యువతిని వ్యక్తిత్వాన్ని హననం చేసే పనికి అతను పాల్పడ్డాడు. అతన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనిలో పని చేస్తున్న యువతి తనకు ఏడాది కాలంగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి అసభ్య, అభ్యంతకరమైన మెసేజ్‌లు వస్తున్నాయని, ఫేసుబుక్‌లో తన ఫోటోను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన అధికారులు సాంకేతికి పరిజ్ఞాణంతో ఐపీ అడ్రస్సు, ఫోన్ నెంబరు ద్వారా యువతిని వేధిస్తున్న యువకుడిని గుర్తించారు. అతన్ని ఆమెకు పరిచయం ఉన్న నూతటి సురేష్ అని పోలీసులు నిర్ధారించారు. నూతటి సురేష్ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. యువతితో పరిచయం ఉండడంతో ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలిపి వివాహం చేసుకుంటానని వెంటపడ్డాడు.
దానికి యువతి తిరస్కరించడంతో కోపం పెంచుకున్న సురేష్ నకిలీ ఫేసుబుక్ ఐడితో ఖాతాను తెరిచాడు. యువతి స్నేహితుల ఖాతాల నుంచి ఆమె ఫోటోలను సేకరించి మార్ఫింగ్ చేశాడు. ఇలా మార్ఫింగ్ చేసిన అసభ్యకరమైన ఫోటోలను వాట్స్‌అప్, నకిలీ ఫేసుబుక్ ఖాతాలతో వాటిని యువతి స్నేహితులు, బంధువులకు పంపిస్తూ ఆమెను వేధిస్తున్నాడు. ఈ ఆధారాలను సేకరించిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సురేష్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications