కేపీహెచ్‌బీలోని హాస్టల్లో ఉరేసుకొని మహిళా టెక్కీ ఆత్మహత్య

హైదరాబాద్: భాగ్యనగరంలోని కేపీహెచ్‌బీలో ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న యువతి పేరు తేజస్విని. ఆమె వయస్సు 25 ఏళ్లు. ఆమె తాను ఉంటున్న హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం వరంగల్ జిల్లా కాజీపేట.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం జిన్నారం గ్రామ సమీపంలో వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైన ఉన్న ఇద్దరు యువకులు అక్కడికి అక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు ఓ విందులో పాల్గొని వస్తుండగా ఇది చోటు చేసుకుంది.

 Techie commits suicide in KPHB in hostel room

హెచ్చార్సీకి అత్యాచార బాధితురాలు

తన పైన సామూహిక అత్యాచారం జరిగిందని ఓ యువతి హెచ్చార్సీని ఆశ్రయించింది. వీఆర్వో చంద్రమోహన్ సహా పలువురు తన పైన అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. కాగా, అత్యాచారానికి పాల్పడిన నిందితులు లొంగిపోయారు. వారికి రిమాండ్ విధించారు.

భర్త ఇంటికి రానివ్వడం లేదని బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన మహిళ

ఆడపిల్ల పుట్టిందని భర్త ఇంటికి రానివ్వడం లేదని ఓ మహిళ బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బాలల హక్కుల సంఘం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు, ఎల్పీ నగర్ డీసీపీకి నోటీసులు పంపించింది. జూన్ 16వ తేదీలోపు నివేదిక అందించాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+