మొగుడు కాదు కాలయముడు: పిల్లలు లేరని వేధింపులు, వివాహేతర సంబంధాలు, భార్య ఆత్మహత్య..
వారిద్దరీ మనసులు కలిశాయి. ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే ఇద్దరి ప్రొఫెషన్ మాత్రం వేరు.. యువతీ టెకీ కాగా, అతను ఫైలట్. పిల్లలు కలుగకపోవడం వారి మధ్య గొడవలకు దారితీసింది. అంతకుముందు గొడవలు ఉన్నా.. పిల్లల పేరుతో మాత్రం గొడవ పీక్ స్టేజీకి చేరింది. ఎంత అంటే ఆ వివాహిత ఆత్మహత్య చేసుకునే స్థాయికి చేరింది. సూసైడ్ చేసుకునే ముందు ఆమె వీడియో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ప్రపంచానికి తెలిసింది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం.. అతనిఅత్తమామలు చూసి చెబితే గానీ ప్రేమపేరుతో పెళ్లిచేసుకొని వేధించిన సదరు భర్తకు తెలియలేదు.

కలహాల కాపురం..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన లావణ్య లహరి, వెంకటేశ్ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 8 ఏళ్ల కింద వారికి పెళ్లి కాగా.. పిల్లలు కలుగలేదు. దంపతులు శంషాబాద్‌లో ఉంటున్నారు. లావణ్య సాప్ట్ వేర్ ఇంజినీర్ కాగా, భర్త పైలట్‌గా పనిచేస్తున్నారు. అందరూ దంపతుల మధ్య వీరి మధ్య కూడా గొడవలు ఉన్నాయి. కానీ పిల్లల పేరుతో వెంకటేశ్ తన భార్యకు టార్చర్ అంటే ఇదేనని చూపించాడు. దీనికి అత్తమామలు కూడా తోడయ్యారు. కొడుకుకు మంచి చెప్పాల్సిన వారు.. సూటి పోటీ మాటలతో వేధించారు. ఇటీవల ఇంట్లో భార్యపై వెంకటేశ్ దాడిచేయగా.. పెంపుడు కుక్క ఆపే ప్రయత్నం చేసింది. గొడవ అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. గొడవ తర్వాత లావణ్య తీవ్ర మనస్తాపానికి గురైంది.

బలవన్మరణం..
లాభం లేదనుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. సూసైడ్ నోట్ రాసిన లావణ్య.. తన బాధను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తమ మధ్య గొడవలను లావణ్య ప్రధానంగా వివరించారు. తాను కూడా తప్పులు చేశానని కానీ సవరించుకున్నానని పేర్కొన్నది. కానీ తన భర్త మాత్రం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. అతను అంటే తనకు చచ్చేంత ప్రేమ.. కానీ అతను మాత్రం ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని వాపోయింది. ఆ పనులు చూడలేక చనిపోతున్నానని లావణ్య తెలిపింది.

వీడియో పోస్ట్
భార్య భర్తల మధ్య గురువారం గొడవ జరగగా.. శుక్రవారం వీడియో పోస్ట్ చేసి బలవన్మరణానికి పాల్పడింది లావణ్య. అయితే ఫేస్‌బుక్‌లో వీడియోను లావణ్య పోస్ట్ చేయగా.. తొలుత అతని అత్తమామలే చూశారు. వెంటనే తమ అల్లుడికి సమాచారం ఇచ్చారు. అయితే అతను గదిలోకి వెళ్లేసరికి లావణ్య అచేతంగా పడి ఉంది. కూతురు చనిపోయిందని తెలిసి పేరంట్స్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. లావణ్య మృతికి వెంకటేశ్ కారణం అని అత్తమామలు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications