టెక్కీ పట్ల డ్రైవర్ అసభ్యంగా, క్యాబ్‌నుండి దూకేయత్నం

హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ క్యాబ్ డ్రైవర్ సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతి గచ్చిబౌలి నుండి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వెళ్లే క్రమంలో ఇది జరిగింది.

ఆమె కాచిగూడ స్టేషన్ వెళ్లేందుకు క్యాబ్ ఎక్కింది. మార్గమధ్యంలో క్యాబ్ డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతను తాగి ఉన్నాడు. దీంతో యువతి క్యాబ్ ఆపమని డ్రైవర్‌ను అడిగింది. అతను మాత్రం ఆపలేదు. క్యాబ్ రన్నింగులో ఉండగానే ఆమె కారు డోర్ తీసింది. దీంతో, డ్రైవర్ కారును నిలిపాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హోర్డింగ్‌పైకి ఎక్కి యువకుల నిరసన

Techie tries to jump from running car

ప్రైవేటు పరిశ్రమలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తూ ఇద్దరు విద్యార్థి జేఏసీ విద్యార్థులు కోటిలోని హోర్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. ప్రభుత్వ భూములను సర్కారు వెనక్కి తీసుకునే వరకూ తాము కిందకు దిగేది లేదన్నారు.

కండక్టర్ ఆత్మహత్యాయత్నం

రాజేంద్ర నగర్ ఆర్టీసీ బస్సు డిపో వద్ద కండక్టర్ ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటి పైన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన అతనిని తోటి ఉద్యోగులు అడ్డుకున్నారు. అధికారులు తనను వేధిస్తున్నారని కండక్టర్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+