ముంబైలో చిక్కాడు: హార్లీ డేవిడ్సన్ బైక్ దొంగ ఇతడే (ఫోటోలు)
హైదరాబాద్: టెస్ట్‌డ్రైవ్ పేరుతో హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని హార్లీ డేవిడ్సన్ షోరూంలో ఖరీదైన బైక్‌తో పారిపోయిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం ప్రకటించారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు బంజరాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడిని ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో గత కొంతకాలం నుంచి అతని మానసికస్థితి సరిగ్గా లేదని బైక్ దొంగిలించిన తొర్లపాటి కిరణ్ వెల్లడించాడు.
కిరణ్ మాట్లాడుతూ నాకు హార్లీ డేవిడ్సన్ బైక్ నడపాలన్న ఆశ ఎప్పటినుంచో ఉందన్నాడు. డబ్బులు ఇవ్వాలని అడిగితే తల్లిదండ్రులు కాదనడంతో కసి పెంచుకున్నానని చెప్పాడు. ఎలాగైనా ఈ బైక్ నడిపి తీరాలన్న ఉద్దేశ్యంతోనే దొంగతనం చేశానని నిందితుడు తొర్లపాటి కిరణ్ తెలిపాడు.

ముంబైలో చిక్కాడు: హార్లీ డేవిడ్సన్ బైక్ దొంగ ఇతడే
'ఓఎన్జీసీ ఉద్యోగినైన నేను ముంబై సముద్ర జలాల్లో 15 రోజులు విధులు నిర్వహిస్తాను. మిగతా 15 రోజులు సెలవులో ఉంటా. రేయింబవళ్లు పని చేయడం వల్ల నిద్రాహారాలు లేక మానసికంగా అనారోగ్యం పాలవుతున్నా' అని అతను చెప్పినట్లు డీసీపీ తెలిపారు.

ముంబైలో చిక్కాడు: హార్లీ డేవిడ్సన్ బైక్ దొంగ ఇతడే
ముంబైలో బైక్‌ను విక్రయిస్తున్న సమయంలోనే బంజారా హిల్స్ క్రైం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని డీసీపీ చెప్పారు. నిందితుడి నుంచి బైక్‌ను స్వాధీనం చేసుతున్నట్టు వెల్లడించారు.

ముంబైలో చిక్కాడు: హార్లీ డేవిడ్సన్ బైక్ దొంగ ఇతడే
ఈనెల 1న బంజారాహిల్స్‌లోని హార్లీ డేవిడ్సన్ షోరూంలో ఆరు లక్షల విలువైన వాహనాన్ని ట్రయల్ రన్ చూస్తానని చెప్పి బైక్‌తో పరారైన సంగతి తెలిసిందే. షోరూం నిర్వహకుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు.

ముంబైలో చిక్కాడు: హార్లీ డేవిడ్సన్ బైక్ దొంగ ఇతడే
హార్లీ డేవిడ్సన్ బైకు గురించి క్షుణ్ణంగా ముందుగానే అన్ని తెలుసుకుని మరీ కొట్టేసినట్లు తెలిసింది. హార్లీ డేవిడ్సన్ బైక్ లీటరుకు 12 కిలోమీటర్లు వస్తుందని ముందే తెలుసుకున్న కిరణ్, ఏ విధంగా చోరీ చేయాలని పక్కా ప్రణాళిక రచించుకున్నాడు.

ముంబైలో చిక్కాడు: హార్లీ డేవిడ్సన్ బైక్ దొంగ ఇతడే
ముందుగా బైక్ కొట్టేసేందుకు ఇరవైవేలు సమకూర్చుకున్నాడు. ఒకసారి ట్యాంకు నింపితే 150 కిలోమీటర్లు పోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లతో చోరీ చేశాడు. సాగర్‌సొసైటీలోని షోరూంనకు వెళ్లకముందు ముంబైకి ఓ ఫోన్ చేశాడు. అదే ఇప్పుడు అతడిని పట్టించింది.

ముంబైలో చిక్కాడు: హార్లీ డేవిడ్సన్ బైక్ దొంగ ఇతడే
ముందుగా శామీర్‌పేట సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోలు కొట్టిచ్చినట్లు పోలీసులకు సీసీ ఫుటేజీ దొరికింది. ఆ తర్వాత కరీంనగర్ హైవే మీదుగా సదాశివపేట చేరుకున్నాడు. అక్కడ హీరో హోండా షోరూంలో హెల్మెట్ కొనుగోలు చేశాడు. తర్వాత సదాశివపేట శివారు ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకున్నట్టు విచారణలో తేలింది.












Click it and Unblock the Notifications