సాప్ట్‌వేర్ ఇంజనీర్లు అదృశ్యం... పెళ్లి ఇంట్లో విషాదం..!
హైదరాబాద్: సినిమా చూసేందుకని వెళ్లిన ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు అదృశ్యమయ్యారు. మేడిపల్లి పోలిస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ శివశంకర్ రావు కథనం ప్రకారం బోడుప్పల్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే మనేష్ పాటిల్ (32), ఆంటోని (21) సాప్ట్‌వేర్ ఉద్యోగులు.
వీరిద్దరూ డిసెంబర్ 9న సినిమా చూసేందుకని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వారిద్దరి గురించి ఎంత గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు గురువారం మేడిపల్లి పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాప్ట్‌వేర్ ఇంజనీర్ల కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
కట్టంగూర్‌లో పెళ్లి ఇంట్లో విషాదం:
నల్గొండ జిల్లా కట్టంగూర్‌లో పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బావమరిది పెళ్లికి వచ్చిన బావ నీటి గుంతలో పడి మృతి చెందాడు. పెళ్లి మండపంలో బంధువుల రోదనలతో మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications