Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆదిలాబాద్‌లో బాహుబలి స్టంట్స్: 8వ, తరగతి విద్యార్థి సురేష్ మృతి

ఆదిలాబాద్: 'బాహుబలి' తెలుగు సినిమా పేరును ప్రపంచంలో మార్మోగిపోయేలా చేసింది. అయితే బాహుబలి సినిమా ప్రభావం యువతపై తీవ్రంగా ఉంది. బాహుబలి పార్ట్ 1 లో హీరో ప్రభాష్ చేసినట్టుగా ఓ స్టంట్‌ను చేసేందుకు ప్రయత్నించిన ఓ 8వ, తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.

బాహుబలి పార్ట్ 1 లో హీరోయిన్ తమన్నా కోసం హీరో ప్రభాష్ ఓ ఎత్తిపోతల వద్ద ఎత్తైన బండరాళ్ళను ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. పలుమార్లు ప్రయత్నించి చివరకు విజయం సాధిస్తాడు.

Teen dies while trying Baahubali like stunt in Adilabad district

అయితే అదే తరహలో మిట్టె జలపాతం వద్ద 8వ, తరగతి విద్యార్థి సురేష్ ఇదే తరహీ స్టంట్‌ను ప్రదర్శించేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ మండలకేంద్రానికి చెందిన సురేష్ మిట్టె జలపాతం వద్ద బాహుబలి స్టంట్‌ను ప్రదర్శించాడు.

బాహుబలి సినిమాలో ప్రభాష్ ప్రదర్శించిన స్టంట్‌ను ప్రదర్శించకూడదని స్నేహితులు వారించినా కానీ సురేష్ వినలేదు. స్నేహితుల సూచనలను కూడ వినకుండానే సురేష్ బాహుబలి స్టంట్ తరహలోనే జలపాతంలోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ తరహ స్టంట్‌ను ప్రదర్శించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+