చంద్రబాబుకు రేవంత్ ఆత్మీయ స్వాగతం-భేటీ ప్రారంభం..!

హైదరాబాద్ లో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ మొదలైంది. ఇవాళ రేవంత్ రెడ్డితో భేటీ కోసం ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబు, ఏపీ మంత్రులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదురేగి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర అధికారులు, మంత్రులతో కలిసి రేవంత్ స్వాగతం పలికారు. అనంతరం వీరంతా కలిసి ప్రజా భవన్ లోకి వెళ్లి చర్చలు ప్రారంభించారు.

ప్రజా భవన్ లోకి వెళ్లి చర్చలు ప్రారంభించే ముందు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ పుస్తకం బహూకరించారు. అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అజెండా మేరకు చర్చలు మొదలుపెట్టారు. దాదాపు రెండు గంటల పాటు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పలు విభజన సమస్యలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం సందర్భంగా ప్రజా భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

telananga cm revanth reddy heary welcome to Andhra counterpart Chandrababu meeting begins

ఏపీ-తెలంగాణ విభజన పూర్తయి పదేళ్లు గడిచిపోయినా సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. దీంతో ఇవాళ జరిగే భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా సమస్యలపై చర్చించి వాటిలో కొన్నింటికైనా పరిష్కారం కనుగొంటారనే ఆశాభావం ఇరు రాష్ట్రాల ప్రజల్లో ఉంది. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాలూ ఓ అంగీకారానికి వస్తే కేంద్రం కూడా వీటిని ఆమోద ముద్ర వేయడం లాంఛనమే. దీంతో ఇరు సీఎంల భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+